• Punarapi Jananam
 • Ebook Hide Help
  ₹ 90
  100
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • పునరపి జననం

  Punarapi Jananam

  Author:

  Pages: 140
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

శుక్రవారం రాత్రి తొమ్మిదిగంటలప్పుడు కాశీపతికి ఫోన్‌కాల్ వచ్చింది.

"నమస్కారమండి! రాజారావును మాట్లాడుతున్నాను.... గుర్తున్నాను కదా... నెలరోజుల క్రితం నూ అమ్మాయికి మీ అబ్బాయి రాధేశ్యామ్‌తో అలయన్స్ విషయం అడిగితే కొద్దిరోజులు ఆగి మాట్లాడదామన్నారు." "చెప్పండి!" అన్నాడు కాశీపతి.

మొదటిసారి ఆయన ఫోన్ చేసినప్పుడే చలపతితో చర్చించాడు. ఆ ప్రాపోజల్‌ను తిరస్కరించవద్దని ఆయన సలహా ఇచ్చాడు. అన్నీ సానుకూలమయితే, జయంతి వివాహం అయింతరువాత చేద్దామంటే సరిపోతుంది... మన అభిమతాన్ని కాదనలేరు కదా!

"అదివారం ఉదయం పదిగంటలకు నేనూ, నా మిసెస్ వద్దామనుకుంటున్నాం మీ ఇంటికి... అబ్బాయిని ఉండమంటారా!"

“అలాగే! వెల్‌కమ్... నేను మీకు చెప్పానుగదా, మా అమ్మాయికీ సంబంధాలు చూస్తున్నామని... దానిది అయిం తరువాతే అబ్బాయికి చేయాలనేది మా ఉద్దేశ్యం... లేదా దానికి కుదిరితే రెండూ ఒకేసారి చేసినా చేయవచ్చు!" ఆయనకు జయంతి చెప్పిన మాటలు గుర్తుండటంతో కాస్త అటూ ఇటూ కాకుండా చెప్పాడు. దాన్ని వివాహానికి ఒప్పిస్తే, చూడటానికి చక్కగా వుంటుంది కాబట్టి, సంబంధం దొరకటంలో అంత పెద్ద ఇబ్బందేమీ ఉండకపోవచ్చు!

ఆయన చిన్నగా నవ్వాడు. "మీ అమ్మాయికీ త్వరలోనే కుదరాలని కోరుకుంటాను... అందుకు ఏమాత్రం సాయం చేయగలిగినా నేనూ చేస్తాను!"

"సంతోషమండి... మీరు వచ్చేటప్పుడు అమ్మాయి ఫొటోను, జాతకాన్ని తీసుకురండి... మా అబ్బాయి జాతకం మీకిస్తాను... మన సంప్రదాయంలో ప్రథమ మెట్టు అదేకదా... ఇద్దరివీ కలిస్తే చూపులు ఏర్పాటు చేయవచ్చు! "

"థాంక్యూ!

తరువాత పావుగంటకు రాధేశ్యామ్ తండ్రి గదిలోకి వచ్చాడు. హాల్లో ల్యాండ్ లైన్లో తండ్రి మాట్లాడిన మాటలు విన్నాడు.

"నేను నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను, నాన్నా!"

“చెప్పరా... నేనే నిన్ను పిలుద్దామనుకుంటున్నాను!"

"హిమబిందును వివాహం చేసుకోవాలనుకుంటున్నాను!"

ఉలిక్కి పడ్డట్లుగా కొడుకు వంక చూచాడు. "హిమబిందు ఎవరురా?”

"మనకు తెలిసినవాళ్ళే. విష్ణుమూర్తిగారి అమ్మాయి!"

“విష్ణుమూర్తి ఎవరు?” కొడుకు వంక అనుమానంగా చూచాడు. అతడు శేషాద్రి బంధువు కాదు గదా!

“అదేఁవిటి అప్పుడే మర్చిపోయారా.... అన్నయ్య పెళ్ళిలో వాళ్ళమ్మాయిని తీసుకువచ్చి పరిచయం చేసి అడగలేదా... తరువాత గూడా మనింటికి వచ్చి గుర్తు చేశారు!.... నాకు ఆ అమ్మాయి బాగా నచ్చింది. నాన్నా!"

“మీ అన్నయ్య మామగారి వైపు బంధువేనా?" కంగారుగా అడిగాడు కాశీపతి మరోసారి తన అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలన్నట్లుగా.

“అవును!

ఆయన ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయలేదు. “అలాంటి దరిద్రపు మనుష్యుల్ని నేను నా జీవితంలో చూడలేదురా... అందుకే ఆయన ఒకటి రెండు సార్లడిగినా నేను సుముఖత చూపనిది!... అసలు వాళ్ళను పట్టించుకోలేదు కనుకే వాళ్ళ పేర్లుకూడా గుర్తులేదు!!

"అన్నయ్య మామగారి బంధువులయినంత మాత్రాన అంతా ఆయనలాగానే ఉంటారని ఎందుకనుకుంటావ్... స్వంత సోదరులే ఒక రకంగా ఉండరు... నేను మాత్రం ఆ అమ్మాయినే చేసుకోవాలనుకుంటున్నాను... ఆ అమ్మాయి ఇప్పుడు మా పక్క బిల్డింగ్‌లోనే పనిచేస్తున్నది. మంచి జీతం వస్తున్నది... మేం ఒకటయితే ఇద్దరి భవిష్యత్తు బ్రహ్మాండంగా వుంటుందనేది నా ఆలోచన!

నిర్ఘాంతపోయి నోరు తెరుచుకుని కొడుకునే చూస్తూ ఉండిపోయాడు కాశీపతి. రాధేశ్యామ్ రెండు రోజులకొకసారన్నా ఆ అమ్మాయిని కలుస్తున్నాడని, ఇద్దరూ కలిసి రోడ్ల వెంట, పార్కుల వెంట తిరుగుతున్నారనే నిజం తెలిస్తే ఇంకెంతగా ఉక్కిరిబిక్కిరి అయ్యేవాడో!

Preview download free pdf of this Telugu book is available at Punarapi Jananam