-
-
పునరాగమనం
Punaragamanam
Author: Sripada Swatee
Publisher: Surya Prachuranalu
Language: Telugu
అరవైయవ దశకం చివర్లో కలంపట్టిన శ్రీపాద స్వాతి "ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి రచయితల సంఘం" ఆవిర్భావం నుంచి గత నాలుగు దశాబ్దాలుగా రచనలు చేస్తున్న విలక్షణ రచయిత్రి. కథ, నవల, కవిత - తనదైన ముద్రతో రాయడం ఆమె ప్రత్యేకత.
అభివ్యక్తిలో క్లుప్తత, గాఢత అభినందించదగ్గ అంశాలు. జీవితాన్ని, సమాజాన్ని లోతుగా పరిశీలించిన ఈ రచయిత్రి తన రచనల్లో అనుభవశకలాలను ప్రతిఫలింపచేస్తారు. ఏ వాదానికి కట్టుబడని ఈమె మానవీయ దృక్పథంతో రచనలు చేస్తున్నారు.
ఈ 'పునరాగమనం' నవల లోగడ ' కౌముది' అంతర్జాల పత్రికలో ' పడమట సూర్యోదయం' పేరిట వరుసగా ప్రకటించబడి సంచలనం సృష్టించింది.
స్వాతి తెలుగులో సృజనాత్మక రచయిత్రి మాత్రమే కాకుండా తెలుగు నుంచి ఆంగ్లంలోకి, ఆంగ్లం నుంచీ తెలుగులోకి సమర్థంగా అనుసృజన చేయగల అనువాదకురాలు.
35 మంది రచయిత్రుల తెలుగు కథలను ఆంగ్లంలోకి అనువదించారు. సాహిత్య అకాడెమీ కోసం భవానీ భట్టాచార్య జీవిత చరిత్రను ఆంగ్లం నుంచీ తెలుగులోకి అనువదించారు.
- ప్రకాశకులు
The theme itself is interesting. But, I find the novel full of un-natural scenes (its a personal opinion). Also, there are so many ambiguities in sentence formations, majorly because of typos or missing punctuations:
Eg:
"ఏదో చెయ్యాలన్న తపన ఖాళీగా ఉంటే బుర్రను నమిలేసే పిచ్చి పిచ్చి ఆలోచనలు శ్రీనే ఎన్నిసార్లు సతాయించేదో..కానీ అతనికీ విషయం ఆలోచించే తీరికేదీ?"
"ఆన్సరింగ్ మెషీన్ చేస్తే అన్నీ ఓదార్పు మాటలే" (ఏం చేస్తే?)
"మమ్మీ నువ్వు ఇదివరకులా లేవు పోనీ నేను వచ్చేయనా?"
"పదికికోక బరువు"