-
-
పులి వేట
Puli Veta
Author: Dr. Koti Kapuganti
Publisher: Self Published on Kinige
Pages: 169Language: Telugu
అందమైన చెట్లు...పారే...సెలయేర్లు...ఎగిరే పక్షులు...కనువిందు చేసే జంతువులు అన్ని కలిపితే...అడవి. జీవితంలో...అడవి చూడని వారు ఉంటారు కానీ...అడవి గురించి వినని వారు మాత్రం ఉండరు.
అడివంటే... వృక్షాలు దట్టంగా ఉండే ఓ ప్రదేశం. అడివంటే... వివిధరకాలైన పక్షులకు మరెన్నో..... రకాలైన జంతువులకు నెలవు.
అడివంటే... జనసంచారము తక్కువగా..ఉండే... ఓ... రమ్యమైన ప్రదేశం. అడివంటే... వర్షపాతానికి ప్రధాన ఆధారం. అనేకమైన ఆహార పదార్ధాలు... ఇతర ఉపయోగకరమైన వస్తువులు...పుష్కలంగా లభించే ప్రదేశం."
"మా మావయ్య జంగారెడ్డి నారాయణరావుగారు ఆ రోజుల్లో... 'డబల్ బ్యారేల్డ్ రైపైల్ లైసెన్స్ హోల్డర్' ఆయనకు అడివంటే... మహా సరదా... ఎప్పుడూ అడవుల్లో తిరుగుతూ...కలప వ్యాపారం చేస్తూ... ఉండేవాడు".
మేము చిన్నప్పుడు ఆయన కనిపించగానే.. చుట్టూ...చేరి....అడవి గురించి చెప్పమని ఆడిగేవాళ్ళం ఆయన మమ్మల్ని విసుక్కోకుండా...అడవి గురించి మాకు తెలియని... అనేక విషయాలు చెప్పేవారు... అంతే కాదు ఒకటీ... రెండు సార్లు మమ్మల్ని తనతో అడవికి కూడా తీసుకెళ్లారు.
"అలాగే అడవితో నా మరో అనుభవం ఏమిటంటే...నాకు వెటర్నరీ ఆఫీసర్ గా... ప్రమోషన్ వచ్చినప్పుడు నన్ను వై.రామవరం ట్రాన్స్ఫర్ చేసారు దాదాపు ఏడు సంవత్సరాలు నేను అక్కడ పనిచేసాను"." ఇలా...అడవితో నాకున్న అందమైన అనుభవాలను కథలుగా మారిస్తే...ఎలా ఉంటుంది? అన్న ఆలోచనవచ్చింది . "ఆ ఆలోచనల ప్రతి రూపమే...నా... ఈ అడవి కథలు".
- డా. కోటి కాపుగంటి
This is very interesting subject. Mr. Koti Kapuganti got good marks in it. Chinnatanam nunchee kathalante andaroo istapadatharu. Adavi kathalante inkaa aasakthi choopistharu.
'Puli Veta' Navala pattu vidavakundaa chadivinche Navala. Good narration. Nice Story.