-
-
పూలమనసులు - నండూరి సుందరీ నాగమణి
Pula Manasulu Nandoori Sundari Nagamani
Author: Nandoori Sundari Nagamani
Publisher: J.V.Publications
Pages: 168Language: Telugu
కథాసంకలనం పేరు పూలమనసులు!
రచయిత్రి పేరు నండూరి సుందరీ నాగమణి.
అందరూ 'సుమన' అని పిలుస్తుంటారు. నేను మాత్రం ‘సుందరీ' అనే సంబోధిస్తుంటాను.
ఇందులో కథలు ఇరవయ్యొకటి వున్నాయి.
అన్నీ చదివాక అర్ధమయ్యింది ఒకటే... రచయిత్రి సున్నిత హృదయం. అన్ని కథలూ దాదాపు పువ్వుల్లా సున్నితంగా, సుకుమారంగానే వున్నాయి. ప్రతి కథ ఆశావాదంవైపే దారి చూపిస్తుంది. అప్పుడర్థమయింది ఆమెను అందరూ సుమన అని ఎందుకు పిలుస్తున్నారో!
- మన్నెం శారద
నండూరి సుందరీ నాగమణి అనే నేను రచయిత్రిగా ఉద్భవించి దశాబ్ద కాలం దాటింది. ఈ పది సంవత్సరాలుగా నేను అవిరామంగా వ్రాస్తూనే ఉన్నాను. నన్ను స్పందింపజేసిన ప్రతి విషయము, ప్రతి సంఘటన, ప్రతి వ్యక్తీ, ప్రతి క్షణమూ కథావిరులై పూచి, మీ ముందుకు వచ్చాయి, వస్తూనే ఉంటాయి.
ఇంతకుముందు వెలువడిన నా కథాసంపుటాలు 'అమూల్యం', 'నువ్వు కడలివైతే...'లు మీరందరూ చదివారు, ఆదరించారు. ముచ్చటైన మూడవ పుస్తకంగా విడుదల చేస్తున్న ఈ ‘పూలమనసుల'ను కూడా అదే ప్రేమతో ఆదరిస్తారు కదూ!
- నండూరి సుందరీ నాగమణి
