-
-
ప్రియమైన శత్రువు
Priyamaina Satruvu
Author: Nalla Sai reddy
Publisher: Self Published on Kinige
Pages: 71Language: Telugu
అంతా నిశ్శబ్ధంగా ఉంది… రోడ్డు మీద ట్రాఫిక్ శబ్ధం తప్ప ఇంకేం వినిపించడం లేదు... గేటు ముందు సెక్యురిటీ గార్డు టెన్షన్‌గా నిలబడి ఉన్నాడు. వాడికి తోడు డాబర్మాన్ డాగ్..చూస్తేనే ప్రాణం పోయేలా ఉంది. ఏ మాత్రం కొంచెం తేడా వచ్చినా చిక్కుల్లో పడతాడని తెలుస్తూనే ఉంది. ఇంటి ముందు గుబురుగా పెరిగిన లాన్.. గేటు పక్కనుంచి ఒక్క పది నిముషాలు కూడా పక్కకి వెళ్ళేలా కనిపించడం లేదు.
ఎదురుగా ఉన్న హోటల్ దగ్గర నిలబడి చుట్టూ చూసాడు కిరణ్.. అరుగు మీద ఎవరో తాగి పెట్టిన కోక్టిన్ కనిపించింది. మెరుపువేగంతో దాన్ని లాన్లో ఉన్న తుప్పల్లోకి విసిరాడు. అంతే ఒక్క ఉదుటన డాబర్మాన్ ఆ శబ్ధం వచ్చిన వైపుకు లాక్కుపోయింది... ఆ ఉహించని విసురుకు, నిలబడ్డ నిద్రమత్తులో.. సెక్యూరిటీ గార్డ్ తూలి పడిపోయాడు. ఇదే అదునుగా కాంపౌండ్ వాల్ దాటి.. లోపలికి వెళ్లిపోయాడు కిరణ్...
రేయినవాటర్ కోసం బిగించిన పైపు ఆధారంగా పైకి ఎగబాకి రెండవ అంతస్తులో ఉన్న ఆఫీస్ గదిలోకి వెళ్ళడం ఏమంత కష్టం కాలేదు కిరణ్‌కి.. ఎందుకంటే ఇంతకు ముందు కారుడ్రైవర్‌గా వచ్చినప్పుడు శ్రీరామ్ చేతికిచ్చిన రూల్ లిస్ట్‌లో సైన్ చేసింది కూడా ఈ ఆఫీస్ రూమ్‌లోనే కాబట్టి. నిజానికి ఆఫీస్‌కి చెందిన ముఖ్యమైన డాక్యుమెంట్స్, ఫైల్స్, ప్రాజెక్ట్ ప్రొసీజర్ ఫైల్స్, దగ్గర నుండి టెండర్ బిడ్డింగ్ ఫైల్స్ దాకా అన్ని ఈ ఆఫీస్రూమ్లోనే ఉంచేవారని సౌమ్య చెప్పిందాన్ని బట్టి అర్థం చేసుకున్నాడు.
కొంగదారం టెక్నిక్‌తో తెరుచుకోని తాళం లేదు. ఎంత సెక్యూరిటీ ఉన్న తాళమైనా సరే దీని ముందు నోరెళ్ళబెట్టేయాల్సిందే.. గట్టిగా దారం చుట్టి ఒక్క లాగుడు లాగేసాడు.. అంతే..బిగుసుకొని ఉన్న తాళం కాస్తా.. ఊడి వచ్చేసింది. ఎదురుగా..
ఏంటీ ఈ పరిస్థితులు...? ఏం జరుగుతుంది అసలు లోకమంతా మంచి నిద్రలో ఉన్న సమయంలో ఊహించని ఈ అలజడికి కారణం అయింది ఎవరు..???
ఓ అందమైన ప్రేమకథ.. ప్రియమైన శత్రువు- చదవండి మరి...
