• Premato Nee Kosam
  • Ebook Hide Help
    ₹ 129
    143
    9.79% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రేమతో... నీ కోసం...!

    Premato Nee Kosam

    Author:

    Pages: 61
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రేమ అనగానే...

ఆడ మగ మధ్య బంధం మాత్రమే ఎందుకు మన కళ్ల ముందు మెదులుతుంది. ఆడ మగ మధ్య ఏర్పడే ఆకర్షణకి అవసరాలు తీర్చుకునే బంధంగా భావిస్తున్నామంటే మనం ఏ విధంగా కరెక్ట్...? అని మళ్లీ ప్రశ్నించుకోవాల్సిందే.. ఇక్కడ ఒక విషయం... మారాల్సింది ప్రేమలో ఉన్న అమ్మాయో, అబ్బాయో కాదు. ముందు వాళ్లని తప్పుగా అర్థం చేసుకునే మనం మారాలి. మన ఆలోచన విధానం మారాలి.

పెద్దల నిర్ణయానికి వ్యతిరేకంగా మన జీవితాన్ని మనం చూసుకోవడమే ఆదర్శవాదమైన ప్రేమ కాదు. ప్రేమ వివాహాలు వికటించట్లేదా..? అని మీరు ప్రశ్నించినప్పుడు మరి పెద్దలు కుదిర్చిన వివాహాలలోనూ విడాకులు ఉన్నాయి కదా.? అంటే, పెద్దల ఆశిస్సులు ఉన్నాయనో, వాళ్లకి భయపడి బంధానికి కట్టుబడటమో జరుగుతూ జీవితం సాగిస్తున్నారంటే, వారి మధ్య బంధం ఉందా..? మీ మీద భయం ఉందా...?

80శాతం కుటుంబాలలో అహంకారంతో భర్త, విధి లేక భార్య పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి కలిసి ఉంటున్నారంటే ఆశ్చర్యం లేదు. తల్లిదండ్రులు అన్ని విషయాల్లో పిల్లల ఇష్టానికి తమ జీవితంలో ఎన్నో త్యాగం చేస్తారు. కానీ, అమ్మాయి, లేదా అబ్బాయి నోటివెంట ప్రేమ అనే మాట వింటే చాలు... ఏదో తప్పు చేసినట్లు, కుటుంబానికి ద్రోహం చేసినట్లు ఎందుకు సాధ్యాసాధ్యాలు మాత్రమే మాట్లాడుతారు...?

25 ఏళ్లు పెంచిన తల్లిదండ్రుల గురించి ఆలోచించమంటారు సరే, మరి ఆ తరువాత 80 సంవత్సరాలు కలిసి బ్రతికే ఛాయిస్ మనం తీసుకున్నందుకు... వ్యతిరేకించడమే పనిగా కాకుండా.. కారణాలు సిద్ధం చేసుకోండి. సారీ...పేరెంట్స్ విచ్చల విడిగా బాధ్యతలను వదిలి పార్క్‌ల వెంట, పబ్స్ వెంట తిరిగే ప్రేమికుల గురించి చెప్పడం లేదు. ప్రేమ బాధ్యతను స్వీకరించేదిగా ఉన్నప్పుడు మాత్రమే... జంట చేయడానికి వెనుకాడవద్దు అని భావంతో..ఈ పుస్తకం.

- నల్లా సాయి రెడ్డి

గమనిక: " ప్రేమతో... నీ కోసం...! " ఈబుక్ సైజు 10mb
Preview download free pdf of this Telugu book is available at Premato Nee Kosam