-
-
ప్రేమలేఖ
Premalekha
Author: Pothuri Vijayalakshmi
Publisher: Sri Rishika Publications
Pages: 142Language: Telugu
ఇది శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి మొదటి నవల. ఇది "శ్రీవారికి ప్రేమలేఖ" సినిమాకి మూలం.
* * *
పాపం... ఆనందరావు! ఏ పాపం ఎరుగని ఆనందరావు పరమ శోత్రియ కుటుంబంలో పుట్టిన పరంధామయ్యగారి కుమారుడు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడిలాగ పితృవాక్య పరిపాలకుడు. ఒకే మాట - ఒకే బాట అన్న ధర్మాన్ని అణువణువునా జీర్ణించుకుని, తండ్రి నిర్ణయించిన బుద్ధిమంతురాలిని పెళ్ళి చేసుకుని ఏ చీకూ చింతా లేకుండా హాయిగా కాలం గడుపుదాం అనుకుంటూ వున్న తరుణంలో 'సోనీ' రాసిన ఉత్తరం పెను తుఫానులా చుట్టేసింది అతన్ని.
మంచం మీద పడుకోలేక పోతున్నాడు. కుర్చీలో కూర్చోలేకపోతున్నాడు. నేలమీద నిలబడలేకపోతున్నాడు. మాములుగా గడ్డం ఆనించుకుని ఆ ప్రేయసి గుర్తువచ్చి పరధ్యానంగా ఉండేసరికి అరంగుళం పొడవు తెగింది గడ్డం. ఆఫ్టర్ షేప్ లోషన్ భగ్గున మండింది. వంట మనిషి వేడిగా చేసి పెట్టిన జీడిపప్పు ఉప్మా చూస్తూవుంటే తన ఒడిలో వాలిన ప్రేయసి గుర్తుకువచ్చి ఏడుపొచ్చింది. ఉప్మాలో మిరపకాయ పొరపాటున కొరికితే నోరు మండింది. అనుక్షణం సోనీ కోసం వెతికి వెతికి వేసారి పోతున్నాడు. రోడ్డు మీద పోయే ప్రతి ఆడపిల్లను పరీక్షగా చూసి కనీసం పదిమందినైనా పలకరించబోయి చివాట్లు తిన్నాడు. మరీ ఒకమ్మాయి చెంప పగలగొట్టబోతే ఎలాగో తప్పించుకుని బయట పడ్డాడు.
* * *
సునిశితమైన హాస్యంతో గిలిగింతలు పెడుతూ చివరిదాక ఆసక్తికరంగా చదివించే నవల ఇది.
