-
-
ప్రేమ + మాయ(ద్వేషం) = విశ్వం
Prema Plus Maya Dwesham Is Equal To Viswam
Author: Chintala Eswara rao
Publisher: Self Published on Kinige
Pages: 26Language: Telugu
సృష్టికి మూలం ప్రేమ మాత్రమే. తల్లిదండ్రులు తమ సంతానాన్ని ఆ ప్రేమ శక్తి చేతనే వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. విభిన్న మనస్తత్వాలు కల్గిన ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమ శక్తి వలన వారి మధ్యన అనురాగం ఏర్పడి ఈ లోకంలో భార్యాభర్తలుగా జీవించ గల్గుతున్నారు. ఇద్దరి మధ్య ఏ మాత్రం పరిచయం లేకపోయినా ఒకరి కోసం ఒకరు ప్రేమికులు జీవిస్తున్నారు. అది ప్రేమ శక్తి చేత మాత్రమే. మానవుడు తెలిసో, తెలియకో, అనేక రకాలైన పొరపాట్లు, తప్పులను చేస్తున్నాడు. అవన్నీ ప్రకృతికి మనషుల మీద ప్రేమ చేతనే భరిస్తుంది. మనల్ని ఇంతలా ఆదరిస్తుంది. అనగా ప్రేమ అనేది భగవంతునిలో ఉన్న అంతర్లీన శక్తి అని అర్థం చేసుకోవచ్చు. ప్రేమ అనేది ఒక పవిత్రమయిన శక్తి స్వరూపం.
సృష్టిలో పవిత్రమైన శక్తి ఉన్నప్పుడు దానికి సమాంతరంగా అపవిత్రమైన శక్తి ఉంటుందని నా భావన. మనం ఎప్పుడైనా రెండు చేతులుతో చప్పట్లు కొట్టగలము. కానీ ఒక చేతితో సాధ్యం కాదు. అలాగే ఈ లోకంలో రెండు శక్తుల కలయిక వలన సృష్టి సాగుతుంది. ప్రేమకు వ్యతిరేకమైనది, విభిన్నమైనది, ద్వేషము, మాయ, ఆకర్షణ ఇవే ప్రేమకు వ్యతిరేక రూపాలుగా భావించాలి. ఈ రెండు శక్తులు ప్రతి జీవిలో ప్రతిబింబిస్తూనే ఉంటుంది. ప్రతి మానవుడు తాను చూసిన ప్రతి దాన్ని, తాను అనుభవించిన ప్రతి దాన్ని ప్రేమించ లేడు, అలాగే ప్రతి దాన్ని ద్వేషించలేడు.. మానవునిలో ప్రేమ - ద్వేషాలు(మాయ) ఉంటాయి అని నిర్ధారణ చేసుకోవచ్చు. ప్రేమ - ద్వేషాలు(మాయ) మధ్య విజయం చివరకు ప్రేమకు మాత్రమే దక్కుతుంది.
ప్రేమ అనేది మనల్నీ పూర్ణత్వం, శాశ్వతమైన ఆనందం వైపు నడిపిస్తుంది.
కానీ మాయ మాత్రం మనల్ని మనం నాశనం చేసుకొనే విధంగా దోహదం చేస్తుంది. ప్రేమ - ద్వేషాలు నుండీ ఏ మనిషి కూడా తప్పించుకోలేడు.కానీ అవి ఎంత ఉండాలో మనం నియంత్రణ చేసుకొనే శక్తి, విచక్షణ జ్ఞానము మానవుడులో ఉంటుంది. మాయను నిరోధించడం మనకు సాధ్యమే.
ఒక మనిషి జీవితంను ప్రేమ మాయ అనే రెండు శక్తులు ఎలా నడిపిస్తుందో, ఎంతవరకు మనల్నీ తీసుకెళుతుందో అని తెలియచెప్పడానికి ఒక విభిన్న కథాంశంతో ఈ విచిత్రమైన కథను నా కల్పన యే ఆధారంగా చేసుకుని ఈ కథను పరిచయం చేస్తున్నాను.
- చింతల ఈశ్వర రావు
