• Prema Pelli Vidakulu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • ప్రేమ...పెళ్లి...విడాకులు (free)

    Prema Pelli Vidakulu - free

    Pages: 129
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

డా.ఎస్.ఎ.ఎస్. కిషోర్ కుమార్‌గారు రచించిన ఈ కథ ఈ కాలం అమ్మాయిలనే కాదు పెళ్లి చేసుకోబోయే అబ్బాయిలను సైతం 'జర భద్రం గురూ!' అని హెచ్చరిస్తుంది. కథ ప్రారంభమే ఓ న్యాయవాదికి వచ్చిన స్నేహితుని ఫోన్ కాల్‌తో మొదలవుతుంది. మూడునెలల క్రితం కొడుకు పెళ్లి చేసి క్రొత్త దంపతులను అమెరికా పంపించిన స్నేహితుడు కంగారుపడుతూ ఫోను చేయడంతో న్యాయవాది ఆలోచనలో పడతారు.

ఆ తర్వాత అమెరికాలో వున్న స్నేహితుని కుమారునికి ఫోను చేసి అసలు నిజాలను గ్రహించిన సదరు న్యాయవాది ఆ భర్తను భార్య నుంచి ఎలా తప్పించాలి? అన్న కోణంలో ఆలోచిస్తూ, స్నేహితుని కొడుకు పెళ్లి చూపుల నుంచి పెళ్లయ్యేవరకు జరిగిన విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ కథను నడిపించిన క్రమం మనల్ని మరొక ఆలోచనకు తావులేకుండా కథలో లీనమయ్యేట్లు చేస్తుంది.

అమెరికాలో సంతోషంగా గడపవలసి భర్తను భార్య వ్రతాల నెపంతో ఎందుకు దూరంగా వుంచింది? ఆఫీసు నుండి హఠాత్తుగా ఇంటికి వచ్చిన భర్తకు భార్య ఫోను ముందు ఎలా దర్శనమిచ్చింది? ఆ తర్వాత అతను ఏం చేశాడు? దేశం కాని దేశంలో ఆ విపత్కర పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి న్యాయవాది సలహాలు ఏవిధంగా ఉపయోగపడ్డాయి? అతన్ని న్యాయవాది అమ్మాయి తరపు నుంచి కూడా ఆలోచించి ఆమె భవిష్యత్తుకు కూడా ఇబ్బంది రాకుండా ఎలా కాపాడారు? ఇదీ కథ.

యదార్ధ గాధ అనగానే ఒకింత ఉత్సాహంతో చదవడం ప్రారంభించిన మనల్ని కథ ఓ రకమైన ఉత్కంఠతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో అన్న ఆత్రుత మనల్ని కథను ఏకబిగిన చదివిస్తుంది.

ఫేస్బుక్, వాట్సాప్, వీడియో కాల్స్ వీటన్నింటి వల్ల యువత పెడదారిన ఎలా పడుతున్నారో ఎన్నో వ్యాసాలు చదువుతున్నప్పటికీ, ఈ యదార్ధ గాధ మనల్ని ఒకింత ఉద్విగ్నతకు గురి చేస్తుంది.

తల్లితండ్రులు పిల్లల ప్రవర్తన పట్ల జాగ్రత్తగా వ్యవహరించకపోతే జరిగే పరిణామాలను రచయిత తన కథ ద్వారా పూసగుచ్చినట్లు చెప్పారు. ఇలాంటి సామాజిక చైతన్యాన్ని కలిగించే మరెన్నో రచనలు రచయిత కలం నుంచి వెలువడాలని ఆశిస్తూ.......

- రేణుక జలదంకి

Comment(s) ...

ఈ నవల అందరూ చదవవలసినది అని నా అభిప్రాయం. తల్లితండ్రులు పిల్లల ప్రేమవ్యవహారాలని ఒక కంట గమనిస్తూ ఉండాలి. వారిని సరైన పద్ధతిలో నడిపించాలి, నచ్చచెప్పాలి. కుదరకుంటే పెళ్లి చెయ్యాలి. అలాగే పిల్లలూ తమ తల్లితండ్రుల్ని ఒప్పించి తమ ప్రేమను నెగ్గించుకుని పెళ్లిచేసుకోవాలి.ఆడపిల్లలు తమ ఫోటోలు వేరే వారి చేతిలో పడకుండా పెళ్లయ్యేవరకూ జాగరూకత వహించాలి. సంకట పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలి అన్న మార్గాన్ని ఈ నవల విపులీకరిస్తుంది.