-
-
ప్రేమ కథలు
Prema Kathalu
Author: Rayavarapu Saraswathi
Publisher: Shaili Publications
Pages: 88Language: Telugu
‘ప్రేమ కథలు' శీర్షికన శ్రీమతి రాయవరపు సరస్వతిగారు వెలువరిస్తున్న కథాసంపుటిలోని కథలన్నీ స్త్రీల కథలు. నేటి సమాజపు పోకడల కథలు. విభిన్న కోణాల్లో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను, సాధిస్తున్న విజయాలను ఈ కథల్లో చర్చించారు. సున్నితమైన అంశాలను కథా వస్తువులుగా స్వీకరించారు. వస్తువు లేదా కథాంశం చిన్నదే అయినా ఆద్యంతం చదివించే కథనం ఆమె కలానికి సొంతం. ఆమె కథల్లో ముఖ్యంగా ప్రస్తావించబడిన అంశాలు స్నేహం, ప్రేమ, మానవ సంబంధాలు, భార్యాభర్తల అనుబంధాలు... వీటన్నిటిపై ఆమె కథలల్లారు. స్త్రీలపై పురుషుల ఆధిక్యం, నేర్పుగా, ఓర్పుతో తన కుటుంబాన్ని, భార్యాభర్తల బంధాన్ని చక్కదిద్దుకునే స్త్రీ పాత్రలు ఈమె కథల్లో పుష్కలంగా ఉన్నాయి. స్త్రీ పాత్రలన్నీ మంచి గుణాలతో అలరించేవే. టి.వి. సీరియళ్ళలోని స్త్రీ పాత్రల్లా దుర్మార్గంగా, కృరంగా కనిపించే పాత్రలు ఈమె కథల్లో అస్సలు కనబడవు. స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని పెంచే కథలు, స్త్రీని సమాజంలో గొప్ప వ్యక్తిగా నిలబెట్టే కథలు. స్త్రీలు తమ అస్తిత్వం కోసం పాటుపడే, పోరాడే నేపధ్యమూ ఉంది. స్త్రీ కుటుంబ వ్యవస్థ మనుగడకు ఎంత ఆధారమో తెలిపే కథలూ ఉన్నాయి. స్త్రీకుండే సహనం, తెగింపు అన్నీ ఈ కథల్లో కనిపిస్తాయి.
- జి. రంగబాబు
