-
-
ప్రేమకప్పులో చిరుతుఫాన్
Prema Kappulo Chiru Tufan
Author: Suryadevara Rammohana Rao
Publisher: Madhupriya Publications
Pages: 105Language: Telugu
మధ్యాహ్నం ఆఫీస్‌లోకి వచ్చింది వర్షిణి.
“నిశాంత్! కుక్‌ని ఎందుకో తిట్టారట. వాళ్ళు తప్పులు చేసినా, ప్రస్తుతం సర్దుకుపోవాలి."
“ఈ హెూటల్ నడిపేది నేను.... నువ్వు కాదు...." కాస్త గట్టిగా అన్నాడు నిశాంత్.
సాధారణంగా మాటల్లో చాలా కంట్రోల్‌గా వుంటాడు. ఈ రోజెందుకో అన్యమనస్కంగా వుంది. వర్షిణి రవినాయక్ని పెళ్ళి చేసుకుంటుందనా?
జెలసీనా...?
మగవాడిలోనూ యింత జెలసీనా?
వర్షిణి ముఖం పాలిపోయింది. విసురుగా బయటకు నడిచింది.
వర్షిణి తన హెూటల్ బాగుకోసమేగా చెప్పింది. తనెంత కష్టపడుతుందో రోజూ చూస్తూనే వున్నాడు. చెప్పే విషయాన్ని నవ్వుతూ చెప్పొచ్చుగా, సీరియస్‌గా చెప్పేసరికి హర్ట్ అయ్యుంటుంది.
ఆమె వెళ్ళిపోతే ఆఫీసు వెలితిగా వుంటుంది.
గంట తర్వాత వేరే పనిమీద పిల్చాడు వర్షిణిని. ఆమె ముఖంలో నవ్వులేదు. కళ్ళలో మెరుపూ లేదు. మనసులోని భావాలను కళ్ళు యిచ్చినంత జడ్జ్మెంట్ ఏదీ ఇవ్వదు.
“వర్షిణీ! ఐయాం సారీ" సిన్సియర్ గానే చెప్పాడు నిశాంత్.
“నో... ఇట్స్ ఓ.కే. నేనే అలా మాట్లాడకుండా వుండాల్సింది. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్.... అంటారుగా."
“అంటే కేవలం బాస్ మాత్రమేనా?" చెప్పడం ఆపి ఆమె వంక చూశాడు.
“ఐమీన్.... ఫ్రెండ్‌వి కదా?" వర్షిణి నవ్వింది.
