• Prema Adhipatyamlo
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 113
    125
    9.6% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రేమ ఆధిపత్యంలో...

    Prema Adhipatyamlo

    Author:

    Pages: 89
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ సంపుటంలో అధికపక్షంగా కనిపించే పాత్ర ఇల్లాలు. 'ఇల్లాలు గొప్ప సేవ, యజమాని ఇల్లు బ్రోవ' అనే వచనం గుర్తుకి వస్తుంది. ఇల్లాలికి ఎన్ని ప్రశ్నలు, సమస్యలు!

స్వల్ప భేదం
కొత్తగా కాపురం ఆరంభించిన మీనా వీధిలో బేరం చేసినప్పుడు కొన్ని బోధనలు నేర్చుకుంటోంది.

ఏనాటి నోము ఫలమో!
కథ ఆరంభంలో 'నోము నోచుకోడంలో విశేషం ఏముంది?' అనే ఆలోచనతో జనకం అయిష్టంగా కనిపించినా, ఆ తరువాత ఆమెలో కనిపించే సంతోషం, ఆత్మ తృప్తి మనం గ్రహించాలి. 'సంప్రదాయం పాటించడంలో ఒక నమ్మిక, హామా సహజం' అని చెప్పే కథ.

ఇద్దరి తప్పు, మాతృ వంశం, మరపురాని బాధ
మొదటి కథలో పిల్లవాడు గోపీ గురించి రెండు భిన్నమైను ఉద్దేశాలు. తక్కిన రెండులోనూ సంతతిలేని ఇల్లాలు దృక్పధం చూస్తున్నాం.

అమ్మలు ఒక విచిత్రమైన పాత్ర. దట్టమైన నల్లజడతో మనకి మొట్టమొదట పరిచయమయే బాలిక. ఆమె జుత్తు బాల్యంలోనే తెల్లబారిబోవడం ఒక వక్రోక్తి (irony) గా రచయత సూచన. కాని కధకుడు (గిరిజ తండ్రి) ఊహాలోకంలో ఆమె 'అవ్వై'గా కనిపిస్తోంది.

'అవ్వై' తమిళులకి బాగా పరిచయమైన పాత్ర. ప్రాథమిక పాఠశాలల్లోనే పిల్లలు ఆవిడ రాసిన నీతి వాక్యాలు చదువుతారు. 'అ', 'ఆ' . . . అనే అక్షరాలతో ఆరంభించి ఆవిడ పలికిన నీతిబోధనలు - 'ఆత్తి చూడి' - అనే పేరుతో సులభంగా అందరికీ అర్ధమౌతాయి. 'ఎప్పుడూ మంచిదే చెయ్', 'కోపం తగ్గించుకోవాలి! అణచుకోవాలి' - ఇటువంటి ఉపదేశాలు ఆవిడ ప్రచారం చేస్తూనే సంచారం చేసారు.

అమ్మలు తనకి పెళ్ళి వద్దంటోంది. కాని కధకుడి కల్పనలో ఆమె జ్ఞానపద అవ్వైగా కనిపిస్తోంది. విచిత్రమేమిటంటే బాలిక గిరిజ తండ్రి ఆమెని అదే దృక్పధంలో చూసి ఆనందిస్తున్నారు! బాలికగానే ఆమె రూపం తండ్రి మనసులో స్థిరపడిపోయింది!

ఇక, ఈ ఆఖరి సంపుటంలో సమగ్రంగా వింధియా కథలగురించి కొన్ని మాటలు:

మొదటి, ఆఖరి సంపుటాల్లోను ప్రముఖ కధ 'ప్రేమ' గురించి అనే విషయం గమనార్హం. సాహిత్యంలో - ప్రపంచ వాజ్మయంలో - ప్రేమకే ఎక్కువ వాటా అని అంటారు. 'ప్రేమ' అంటే ఎన్ని లక్షణాలు! - మోహం, వలపు, ఆశ, ఇచ్చ, భక్తి, దయ - ఇంకా ఎన్నో ! ఇవన్నీ వింధియా కథల్లో కనిపిస్తాయి. ఆ ప్రభావం - అద్భుతం - రచయత విరసం లేకుండా పాఠకులకు ఆవిడ తెలియజేసారు.

'చూడగలికితే ప్రతీ జీవితం అద్భుతం, చదవగలిగితే ప్రతి జీవితం చరిత్ర!' అనే లోకోక్తి ఉంది. 'కద అంటే జీవితంలో ఒక అంశం' (A Short Story is a slice of life) అని కూడా అంటారు. ఆ అంశం చిన్నదైనా, పెద్దదైనా దాన్ని ఆరసించి, తన కల్పనతో, సృజనాత్మక ధోరణిలో వింధియా రాసిన కథలు ఇవి. వీటి మూలంగా నీతికీ, శీలానికి విలువలిచ్చే సామాన్య జనుల అనుభవాలు ఆవిడ పాఠకులతో పంచుకున్నారు.

- ఏండి. సుందరేశన్

Preview download free pdf of this Telugu book is available at Prema Adhipatyamlo