• Prayanam O Samanyudi Atmakatha
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 270
    300
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రయాణం - ఓ సామాన్యుడి ఆత్మకథ

    Prayanam O Samanyudi Atmakatha

    Pages: 272
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


''జీవితంలో ప్రతీ వ్యక్తీ చెప్పగలిగే కథ ఒకటి ఉంటుంది. అది అతని కథ'' అన్నది ప్రపంచ ప్రఖ్యాత రచయిత్రి ''ఎమిలీ బ్లాంటే''. ఆ కథ పూర్వాపరాల్ని, మంచి చెడ్డల్ని - ఆ వ్యక్తి తర్కించుకునే అవకాశాన్ని జీవితం యివ్వదు. కాని ఆ కథ మరొకరికి కొలబద్ద కాగలదు. తండ్రితో పాటు సూటుల్ని వేసుకుని, తోబుట్టువుల మధ్య అపురూపంగా పెరిగిన కుర్రాడు- అర్థాంతరంగా తండ్రి నిష్క్రమిస్తే ప్రతీ పని తన నెత్తి మీద పడినా- అది తన అవకాశంగా భావించి రోజుకి రెండు రూపాయలు సంపాదించే ప్రెస్సు కూలీగా పనిని ప్రారంభించి ఆరు అంకెల జీతం పుచ్చుకునే మేనేజరు కాగలిగిన కేన్వాసు ఒక జీవిత కాలానికి విస్తృతమైనదీ, విభిన్నమయినది, విచిత్రమైనది, విలక్షణమైనది. ఏమిటి జీవితానికి పెట్టుబడి? ఏనాడూ విడువని ఆశ. ఏనాడూ నమ్మకం సడలని పరిశ్రమ. అనునిత్యం బంధువుల పట్ల, స్నేహితుల పట్ల ఆప్యాయత స్నేహంలో ఆదుకునే సేవాభావం, ఓటమికి కృంగిపోని గుండెధైర్యం, నెమ్మదిగా, కాని బలంగా- ఒక్కొక్క ఇటుకనే పేర్చుకుంటూ కట్టుకున్న జీవిత సౌధం సాయినాథ్‌ కథ. ఈ కారణానికి- ఈ కారణానికే ఈ సామాన్యుడి కథ అసామాన్యమయినది.

- గొల్లపూడి మారుతీ రావు

* * *


తాను ఆత్మకథను ఎందుకు రాయాలనుకున్నారో రాసారు శ్రీ సాయినాథ్‌ స్వయంగానే కవితాత్మకంగా చెప్పారు.
ఎందుకంటే ...
నాజీవితంలో ఏ చిన్ని సంఘటనైనా...
ఏ మామూలు సందర్భమైనా...
ఏ మనస్సు తలుపు తట్టినా...
ఏ మనిషి వెన్ను తట్టినా...
ఎవరికి కాసింత గుండె ఆర్తి తీర్చినా...
ఎవరికి అణువంత స్ఫూర్తినిచ్చినా...
నా ఈ జీవితం సార్థకమైనట్లే...
శ్రీ సాయినాథ్‌ జీవితాశయాలకు అద్దం పుతున్న పంక్తులివి.

- పొత్తూరి వెంకటేశ్వర రావు

Preview download free pdf of this Telugu book is available at Prayanam O Samanyudi Atmakatha