• Pravasa Pratibimbalu
 • Ebook Hide Help
  ₹ 30 for 30 days
  ₹ 108
  120
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • ప్రవాస ప్రతిబింబాలు

  Pravasa Pratibimbalu

  Pages: 92
  Language: Telugu
  Rating
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 1 votes.
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

ప్రవాస భారతీయుల జీవనానికి అక్షరరూపం ఇవ్వాలని చాలాకాలంగా నాలో గాఢంగా ఎదిగిన ఆకాంక్షకు ఆకృతి 'ప్రవాస ప్రతిబింబాలు' కవితా సంపుటి.

ప్రవాస తెరపై భారతీయుల బ్రతుకు పోరాటాలు, ఆశనిరాశలు, సంఘర్షణలు, సంఘటనలకు ఇందులోని ప్రతి కవితా ఒక ప్రతిబింబం. వారియొక్క జీవనవిధానం, నిత్యజీవిత అనుభవాలు, సాధించిన విజయాలు ఈ పుస్తకానికి మూలాధారంగా నిలుస్తాయి. ప్రపంచపటంపై ప్రతిచోట అడుగిడిన భారతీయతను స్పర్శించాను.

అనాదిగా భారతీయులకు వలస వెళ్ళే సంప్రదాయం లేదు. గత రెండు శతాబ్దాలుగా కొద్దిమొత్తంలో వలసలు మొదలయ్యాయి. ఆలస్యంగా ఇతర దేశాలకి పయనమయినా త్వరలోనే ప్రపంచమంతటా విస్తరించారు. అత్యంత విజయవంతమయిన ప్రవాససమూహంగా ఎదిగారు. ముఖ్యంగా ప్రవాసాంధ్రులు ప్రకాశంధ్రులై తెలుగునేల గర్వపడేలా చేస్తున్నారు. చాలా కవితలు తెలుగు వెలుగులతో కాంతివంతమయ్యా యి. ఎన్నారైల కృషి, పట్టుదల, సాఫల్యం విదేశీయులు భారతదేశాన్ని చూసే దృక్పథంలో గణనీయమైన మార్పు తెచ్చింది.

అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియాలాంటి పాశ్చాత్య ఖండాల ఆకర్షణ వర్ణాలను చిత్రిస్తూనే గల్ఫ్, ఆఫ్రికా, ఆసియా నేలల అనురాగ గళాలను స్వరపరిచాను. ఎడారి శ్రామికుల చెమట పరిమళాన్ని ఆస్వాదిస్తూ, ఉన్నత విద్యాకుసుమాలను సృజిస్తూ, విభిన్న రంగాలలో శిఖరాలను అధిష్ఠించిన వ్యక్తులను స్మరిస్తూ మేళవించిన పంక్తులను పేర్చాను.

వందల ఏళ్లుగా మాతృభూమికి దూరంగా ఉంటున్నా తామున్న చోటనే మరో భారతావనిని సృష్టించుకున్న ఫిజి, మారిషస్, ట్రినిడాడ్ మరియు టొబాగొ ప్రవాసులు మొదలు నిన్న, ఈవాళ ఉద్యోగ అవకాశాలకై, విద్యాభ్యాసానికై తరలివెళ్లిన అన్ని కాలాల ఆశలు నిక్షిప్తం అయ్యాయి. స్వేచ్ఛా సమాజాలలో సాధించిన ఘనతలను కీర్తిస్తూనే మన ఇరుగుపొరుగు దేశాలలోని మనవారి నిర్బంధ జీవిత వ్యధలను వర్ణించాను.

దాదాపుగా ఇరవై ఏళ్లుగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలలో నివసిస్తున్నందున ప్రవాసజీవిత లోటుపాట్లు అనుభవమే. పూర్వం మూడు కవితాసంపుటులు వ్రాసిన కవిత్వ అనుభవం తోడయి 'ప్రవాస ప్రతిబింబాలు' హృద్యంగా రావడానికి తోడ్పడ్డాయి. నా వ్యక్తిగత ప్రవాస అనుభూతులను కొన్ని కవితలలో వ్యక్తపరిచినప్పటికీ మొత్తంగా సర్వజనీన ప్రవాసజీవితాన్ని పొందుపరచడం జరిగింది. ఈ కవితాసంపుటి మన ప్రవాసుల జీవితాలను మరింత సుపరిచితం చేస్తుందని భావిస్తున్నాను.

- సతీష్ గొల్లపూడి

Preview download free pdf of this Telugu book is available at Pravasa Pratibimbalu