-
-
ప్రతిమాదేవి
Pratimadevi
Author: Athaluri Vijayalakshmi
Pages: 124Language: Telugu
Description
"రండి తాతగారు.." మంచం దగ్గరనుంచి కదిలి సోఫా వైపు నడిచింది
"ఏమ్మా... భోజనం కూడా చేయలేదుట..."ఆయన స్వరంలో అంతులేని ఆప్యాయత...
రోహిణికి దుఃఖం పొంగుకొచ్చింది.... ఏం మాట్లాడలేదు....
"రోహిణీ.. "
"తాతగారూ.." ఉద్వేగంతో ఆయన భుజాలపైన వాలిపోయి, వెక్కి వెక్కి ఏడవసాగింది...
ఆయన్నక్కూడా దుఃఖంతో కాసేపు గొంతు బొంగురుపోయి మాటరాలేదు...
ఆయన పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క..
అటు సర్వం కోల్పోయి, చిటికెడు ప్రేమ కోసం, ఒకింత ఆశ్రయం కోసం దేహీ అంటూ వచ్చిన కూతురు లాంటి ప్రతిమ....
ఇటు స్వశక్తితో ఆస్తినీ, అంతస్తునీ, పరువు ప్రతిష్టలనీ, విశిష్టమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకుని, తనదంటూ పటిష్టమైన జీవితాన్ని ఏర్పరుచుకుని, ఆ జీవితంలో ప్రతిమ రాక అలజడి సృష్టిస్తుందేమోనని తల్లడిల్లిపోతున్న మనవరాలు.....
Preview download free pdf of this Telugu book is available at Pratimadevi
Login to add a comment
Subscribe to latest comments
