• Pratigna Padashilpi Pydimarri
    • fb
    • Share on Google+
    • Pin it!
  • 'ప్రతిజ్ఞ' పదశిల్పి పైడిమర్రి

    Pratigna Padashilpi Pydimarri

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

లక్షల మంది విద్యార్థుల్లో దేశభక్తిని నింపుతున్న 'ప్రతిజ్ఞ' రూపశిల్పి పైడిమర్రి వెంకటసుబ్బారావు. ప్రతి రోజు విద్యార్థులు పాఠశాల దినచర్యను ప్రారంభించే ముందు వందేమాతరం, జనగణమన జాతీయ గీతాలతో పాటు 'భారతదేశము నా మాతృభూమి..' అనే ప్రతిజ్ఞను సామూహికంగా చేసే విషయం తెలిసిందే. సుధీర్ఘకాలంగా పాఠ్యపుస్తకాల్లో కొనసాగుతున్న ప్రతిజ్ఞ రచయిత పేరు వెలుగులోకి రాలేదు. కనీసం రచయితను గుర్తించే ప్రయత్నం కూడా జరిగినట్టు లేదు. ఒక దేశభక్తుడు, సృజనశీలిని గుర్తించి గౌరవించాలన్న ఆలోచన లేకపోవడం దురదృష్టకరం.

తెలంగాణ సృజనశీలి, దేశభక్తుడికి సరైన గుర్తింపు దక్కాలె. ఆయనకు గుర్తింపు, గౌరవం దక్కడమంటే తెలంగాణకు దక్కినట్లే. ఈ ఆలోచన నన్ను వెంటాడింది. చివరికి ప్రతిజ్ఞ కర్త పైడిమర్రి అన్న నిజం ప్రజల్లోకి తీసుకుపోవాలె అనుకున్న. ప్రతిజ్ఞ విశిష్టత గురించి, పైడిమర్రి గురించి ఒక పుస్తకం తీసుకురావాలని పించింది. తెలంగాణ వివిధ అంశాల్లో విశేషమైన కృషి చేసిన, చేస్తున్న సాహిత్యచరిత్రకారులతోటి మాట్లాడిన. అందరూ గొప్పగా స్పందించిండ్రు. అనేక అంశాలతోటి తలావో వ్యాసం రాసిండ్రు. తెలంగాణ బిడ్డ పైడిమర్రికి గౌరవం దక్కాలని కోరుకున్నరు.

ప్రతిజ్ఞ కర్త పైడిమర్రికి తగిన గుర్తింపు కోసం తెలంగాణ వాదులు, సాహిత్య, చరిత్రకారులు గొంతెత్తి పోరాడాల్సిన అవసరముంది. ఈ లక్ష్య సాధనలో ఉపాధ్యాయుల పాత్ర చాలా విలువైనది. అందరం కలిసి పోరాడుదాం. ప్రతిజ్ఞ కర్త పైడిమర్రి అన్న పచ్చినిజాన్ని లోకానికి చెపుదాం. పైడిమర్రిని గౌరవించుకుందాం. తెలంగాణ శక్తిని, ఆత్మగౌరవాన్ని చాటుదాం.

- సంపాదకుడు

Preview download free pdf of this Telugu book is available at Pratigna Padashilpi Pydimarri