• Pratibimbam - free
 • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
  • fb
  • Share on Google+
  • Pin it!
  Ebook Hide Help
 • ప్రతిబింబం (free)

  Pratibimbam - free

  Pages: 166
  Language: Telugu
  Rating
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 3 votes.
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

శ్రీధర్ రెడ్డి బిల్లా గారి కలం నుండి వెలువడిన “ప్రతిబింబం" నిజంగా ప్రతి ఒక్కరి అనుభవాలు, అలోచనలకు నిలువుటద్దంగా నిలుస్తుంది. ఈ గ్రంథంలో రచయిత స్పృశించని అంశం లేదు. సంఘటనలన్నీ మన మధ్యే కదలాడుతున్నట్లుంటాయి.

ప్రస్తుతం ఎవరు ఏ హోదాలో ఉన్నా, బాల్యం ప్రతి ఒక్కరికీ ఓ మరపురాని మధురానుభూతి. అలాంటి బాల్య స్మృతులు, గ్రామీణ నేపథ్యం, పచ్చని పొలాలు, సేద్యం, రైతుల కడగండ్లు, పండిన పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు... ప్రకృతి విలయతాండవం.. అన్ని వైపరీత్యాలను తట్టుకుని పండిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతుల కన్నీరు... ఆరుగాలం కష్టించి పండించిన పంటకు అర్థంలేని ధరను నిర్ణయించి దోచుకునే కార్పోరేట్ సంస్థలు.. కన్నఊరిని, ఉన్న పంట పొలాల్ని వదిలేసి రోజు వారి కూలికోసం పట్టణాల బాట పట్టి జనం పడే కష్టాలు.. ఇంటిల్లిపాదికి పాడితో పాటు, తనువు చాలించిన తర్వాత దేహాన్ని కూడా మానవులకే త్యాగం చేసే ఇంటి బర్రె.. వృద్ధాప్యం లోని బాధలు.. మహిళలపై అత్యాచారాలు.. ప్రవాసాంధ్రుల జీవితాలు.. పసి వయస్సులోనే పెళ్ళె, నానా అగచాట్లు పడుతున్న బాలికలు.. వ్యామోహమే ప్రేమని నమ్మే, తెలిసీ తెలియని వయస్సు.. గమ్యం లేని బాలకార్మికులు.. వేశ్యాగృహాలలో మృగ్యమైపోతున్న జీవితాలు.. అమెరికా పాఠశాలల్లో మాదకద్రవ్యాల సమస్యలు.. అప్పులిచ్చి వాటిని రాబట్టుకోవడంలో పడే తిప్పలు.. కాసులకు కక్కుర్తిపడి అడవులను నరికేస్తూ, చెరువులని చెరిపేస్తూ రాత్రికి రాత్రి వెలిసే ప్లాట్లు, అవి కొన్నవారి పాట్లు.. పేకాట వ్యసనం తెచ్చే ఇక్కట్లు.. కరోనాతో అల్లకల్లోలం అయిన ప్రపంచం... ప్రపంచదేశాల మధ్య యుద్ధ వాతావరణాలూ.. కరోనా గృహనిర్బంధం నేర్పిన క్రమ శిక్షణ.. టి.వి.లో చర్చలంటే బండ బూతుల పర్వం అనే కొత్త నిర్వచనంతో మీడియా.. జీవితంలో అన్నింటా పడే రాజీ.. తెలుగు భాష ఘోష, దుస్థితి.. నానీలు.. రుబాయిలు.. పద్య కవితలైన మధ్యాక్కరలు.. తేటగీతులు.. సీసపద్యాలు... ఆటవెలదులు.. కందాలతో రస రమ్యంగా సాగిన ప్రతి కవితా ఎంతో భావగర్భితంగా, సామాజిక చైతన్యంతో, భాషా సౌందర్యంతో నిండి ఉంది.

ప్రవాసంలో ఉంటూ మట్టి వాసనలను, తన మూలాలను మర్చిపోకుండా అనునిత్యం తన మదిలో మెదిలే భావాలను నెమరువేసుకుంటూ, వర్తమాన జీవిత సత్యాలకు, అనేక సంఘటనలకు అక్షర రూపం ఇచ్చిన శ్రీధర్ గారి ఈ గ్రంథం, సాహిత్య ప్రియులకు, భాషాభిమానులకు షడ్రసోపేత భోజనం లాంటిది. ఈ రచయిత కలం నుండి మరిన్ని రచనలు వెలువడాలని, అవన్నీ అదరణ పొందాలని అభిలషిస్తూ శ్రీధర్ రెడ్డి జిల్లా గారికి హృదయపూర్వక అభినందనలు.

- డా. ప్రసాద్ తోటకూర

గమనిక: "ప్రతిబింబం" ఈబుక్ సైజు 5.4mb

Comment(s) ...

A general perception is that if a book is full of poems, it is difficult for a layman to understand.

But when I started reading this book, I realised it is such an easy-read even for beginners in poetry reading.
We feel that we're in a journey with the poet himself and that is his first success.

The situations depicted here are atleast 30-40 years yet the language is easier for current gen to understand too.
It makes you smile, laugh heartily and also think deeply.