-
-
ప్రతి ఇంటా ప్రయోగశాల
Prati Inta Prayogashala
Author: Dr. Mahidhara Nalini Mohan
Publisher: Manchi Pustakam
Pages: 93Language: Telugu
సైన్సు అనగానే సైన్సు మాస్టార్నీ, వచ్చిన మార్కుల్నీ తలుచుకుని గాభరా పడే పిల్లల్ని ఆకర్షించనికి, అందులో రుచి పుట్టించనికీ, ''ఓస్! ఇంతేనా?'' అని వాళ్ల చేత అనిపించనికి ఈ 'ప్రతి ఇంటా ప్రయోగశాల' తయారు చేశాను. ప్రతి ఇంట్లోనూ దొరికే కొవ్వొత్తి, అగ్గిపెట్టి, కాగితం, గుండుసూది, సీసా, డబ్బూ, రబ్బరుముక్క, పెనిసిలు, దారపుబండి, తీగ, మేకు, చాకు, ఉప్పు, నిమ్మకాయ వంటి అతి సామాన్యమైన వస్తువులతో ప్రతి పిల్లకాయా చేయదగ్గ గారడీలను ఇందులో చూపించాను. (రసాయన శాస్త్రానికీ సంబంధించిన గమత్తులు కొన్ని మాత్రం వీటికి మినహాయింపు.)
ఇవి కేవలం గారడీలు కావు. ప్రతి గారడీ వెనక ఒక శాస్త్రీయ సిద్ధాంతం, ఒక ప్రకృతి రహస్యం దాగి ఉన్నాయి. ఈ రహస్యాలను బయటికి లాగి చూపించమూ, ఈ విధంగా శాస్త్రీయ దృక్పధమూ, అవగాహనా పిల్లలలో కలిగించడమూ నా ముఖ్యోద్దేశం. స్కూళ్లలో సైన్సు బోధించే ఉపాధ్యాయులు కళ్లు ఎర్ర జేయనవసరం లేకుండా గహనమైన శాస్త్రీయ రహస్యాలను అతి
సులభంగానూ, ఆకర్షణీయంగానూ బోధించగలగడానికి ఇవి పనికి వస్తాయని నా ఆశ.
ఇందులోని 25 వ్యాసాలు ఆంధ్రపత్రిక వారపత్రికలోనూ (1978 -79), చిరుమువ్వలు మాసపత్రికలోనూ (1987) ప్రచురించిన ఆయా పత్రికా సంపాదకులకు కృతజ్ఞుడ్ని.
- మహీధర నళినీ మోహన్
we need print book of this