-
-
ప్రథమ బాల శిక్ష - 2 (ఆరోగ్య సూక్తి సుధ)
Prathama Bala Siksha 2 Arogya Sookti Sudha
Author: Bhagavatula Sreenivasa Rao
Publisher: Samanvaya Bharathi
Pages: 144Language: Telugu
ప్రథమ బాల శిక్ష -2 ఆరోగ్య సూక్తి సుధ
ఆరోగ్యం అనేది బజారులో దొరికే వస్తువు కాదు! అది మన దేహంలో, మన మనస్సులో మనకు మనం సాధించుకోవలసిన ఆయుర్ వృద్ధికరమూ, ఆనందమయమూ, అమూల్యమూ అయిన స్థితి!
అందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలు కావాలనే కోరిక మాత్రం ఉంటుంది. ఇందులో సందేహమే లేదు. అయితే ఆరోగ్యంగా జీవిస్తున్నవారు, రోగవిముక్తి పొందుతున్న వారు ఎంత శాతం ఉంటారు?! ఇందుకు కారణాలు, పరిష్కారం ఏమిటి?
సమన్వయ భారతి వారి 'సాంస్కృతిక విద్యా విధానం (Cultural Supplements Scheme) దీనికి ఒక పరిష్కార మార్గం. పిల్లలకు చిన్నప్పుడే మనసులో నాటుకోవలసిన అవసరమైన భావజాలం- స్కూలులోను, ఇతరత్రాను దొరకని వాటిని- ఒక ప్రణాళికాబద్ధంగా 'ప్రథమ బాలశిక్ష' పుస్తక మాలికగా అందించటమే మా పరిష్కార మార్గం! పునాది విషయంలో
'Better Late than Never!' అనేది పనికిరాదు; 'Now or Never!' అనేదే కరెక్టు! 'First Things First!' అనేదే విజ్ఞత. మరి, శారీరక, మానసిక ఆరోగ్యాలకన్న ముఖ్యంగా నేర్చుకోదగిన అంశం వేరేదైనా ఉంటుందా!
ఈ విషయాలన్నీ- మనకు అనుకూలంగా, వివరంగా (Comprehensive)గా- ఆయుర్వేదం చెప్పినంత బాగా చెప్పిన శాస్త్రమే లేదు. అన్ని విజ్ఞానాలకన్న ఆరోగ్యరక్షణ విజ్ఞానం (Health Care Science) ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి అత్యవసరమైనది. అందుకనే పిల్లలకు, తల్లిదండ్రులకు ఆరోగ్యరక్షణపై శాస్త్రీయమైన అవగాహన కలిగించటానికే ఈ పుస్తక
రచన!
ఈ పుస్తకంలో ఆయురారోగ్య సంరక్షణకు ఉపయోగించే 369 సూక్తులను (One- Line Quotations) ను యివ్వటం జరిగింది. సూక్తులను పిల్లలకు కంఠస్థం చేయించటం ముఖ్యోద్దేశం! సూక్తుల క్రింద యిచ్చిన తాత్పర్యాలు మాత్రం తల్లిదండ్రుల అవగాహన కోసం వ్రాసినవి. వారు చదివి, పిల్లలకు తేలికగా అర్థం అయ్యేటట్లు చెబితే ఎక్కువ ఫలితం గదా! 'ఆరోగ్యాన్ని గురించి తెలుసుకోవలసిన అంశాలు ఇన్ని ఉన్నాయా!' అని ఆశ్చర్యం కలగక మానదు. అసలు మా ఉద్దేశం ఆయుర్వేద శాస్త్రం, యోగ శాస్త్రాల యొక్క పరిధులను పిల్లలకు స్థూలంగా పరిచయం చేయటం.
శాస్త్రీయ విషయాలను పిల్లలకు అందించటం కష్టమైన పనే. విషయ గాంభీర్యం తగ్గకూడదు; ఆసక్తికరంగానూ ఉండాలి; స్ఫురించటానికి యోగ్యంగా ఉండాలి. ఈ మూడు అంశాలమధ్య సమతౌల్యం సాధించాలని మాకు చేతనయిన విధంగా చేసిన ప్రయత్నమే ఈ పుస్తకం!
