-
-
ప్రథమ బాల శిక్ష - 1 (తెలుగు సూక్తి సుధ )
Prathama Bala Siksha 1
Author: Bhagavatula Sreenivasa Rao
Publisher: Samanvaya Bharathi
Pages: 104Language: Telugu
ఈ పుస్తకం పేరు 'ప్రథమ బాల శిక్ష' ! తెలుగు వారి పిల్లల లేత మనస్సులలో ప్రప్రథమ సంస్కారాలుగా పడదగిన విషయాల సంపుటి ! ఇది మొదటి భాగం ! తెలుగువారి పిల్లలకు మొట్ట మొదటగా - విశాల భారతీయ సంస్కృతీ భావజాలంతో బాటు, మాతృభాష కమ్మదనంతో కూడా అనుబంధం ఏర్పడలంటే - వేమన పద్య సాహిత్యాన్ని మించినది లేదు ! వీటివల్ల, తేట తెలుగు మాటలతో పరిచయం, తెలుగు పలుకుబడిలోని తియ్యదనం, తెలుగు జాతీయాల గొప్పదనం, తెలుగు కవిత్వపు సౌందర్యం - అన్నీ ఒకే ప్రయత్నంలోనే తెలిసే వీలు ఉంది ! అందుకే, వేయికి పైగా వేమన పద్యాలను పరిశీలించి, పిల్లల కోసమే ఎంచి ఏర్చి కూర్చిన సూక్తుల మణిహారం, కంఠమాల యీ బాలబోధ ! ఇందులోని ప్రతి సూక్తి ఒక ఆణిముత్యమే !
ఈ పుస్తకం వల్ల పిల్లలకు ప్రయోజనాలు
1. భారతీయ సంస్కృతి అంటే ఇదీ - అనే దృక్పథం!
2. తెలుగువారిగా మన కనీస ధర్మాలు తెలియడం!
3. మాతృభాష తెలుగు పలుకులలో తియ్యదనం!
4. యోగి వేమన హృదయం నీతిబోధల సారం (150 వేమన సూక్తులు, 108 వేమన పద్యాలు)
5. నైతిక, సాంస్కృతిక, మానవీయతా వికాసం!
6. ఉత్తమ వ్యక్తిత్వ లక్షణాలు!
7. వివేకం, విచక్షణ, శక్తియుక్తులు!
8. లోకరీతి, వ్యవహార నీతి!
9. సందర్భోచిత వ్యాఖ్యా కౌశలం....
Parents and Teachers get the ability to clarify children's doubts on cultural matters.
