-
-
ప్రతాప రవిశంకర్ కథానికలు
Pratapa Ravisankar Kathanikalu
Author: Pratapa Ravisankar
Publisher: Sri Vedagiri Communications
Pages: 111Language: Telugu
ప్రతాప రవిశంకర్, నేను కలిసి కొన్నాళ్ళు ఆంధ్రభూమి వారపత్రిక సంపాదకవర్గంలో పనిచేశాం..... ఆ రోజుల్లో పోటీపడి కథానికలు రాసేవాళ్ళం...
ఏ రచయిత శిల్పం, శైలిలో రాయమన్నా- ఒక్క రాత్రిలో రాసి చూపించేవాడు రవిశంకర్. అలాగే ఏ పత్రిక సంపాదకులు ఎలాంటి కథానికల్ని ప్రచురించడాని కిష్టపడతారో పంపించి, ప్రచురణలో చూపించి మరీ నిరూపించేవాడు. ఎంత మంచి రచయితో, అంత మంచి వ్యక్తి. ఎంత మంచి రచయితో, అంత మంచి స్నేహశీలి. అన్ని సామాజిక సమస్యల మీద కథానికలే కాదు, అపరాధ పరిశోధనా కథనాలు, పిల్లల కథలు - ఎలాంటి కథానికలనైనా తేలికగా రాయగలిగిన రచయిత రవిశంకర్.
చిన్న వయసులోనే ‘కుంటికాకి’ కథానికకు ఆంధ్రపత్రిక దీపావళి కథానికల పోటీలో బహుమతి పొంది తన సత్తా చూపించుకున్నవాడు - నాకు బాగా ఇష్టమైన రచయిత, మిత్రుడు ప్రతాప రవిశంకర్.
ఆ స్నేహ మాధుర్యానికి మచ్చుతునకగా, ఈ గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్నాము. ఇంతకముందూ రవిశంకర్ కథానికా సంపుటాలు వచ్చాయి. ఒకదానిని నాకు అంకితమిచ్చాడు కూడా. తర్వాతా వస్తాయి. కానీ ఈ సంపుటి ప్రత్యేకత ఈ సంపుటిదే! చదివితే మీరూ ఆ మాటే అంటారు. ఇక ఆలస్యం ఎందుకు? ముందు పేజీల్లోకి వెళ్ళిపోండి.
- వేదగిరి రాంబాబు
