-
-
ప్రసిద్ధ సమకాలీన కన్నడ కథలు
Prasiddha Samakaleena Kannada Kathalu
Author: Ranganatha Ramachandra Rao
Publisher: Lakshmi Prachuranalu
Pages: 128Language: Telugu
డా॥ కు. వీరభద్రప్ప, డా॥ బరగూరు రామచంద్రప్ప, డా॥ బెసగరహళ్ళి రామణ్ణ, డా॥ కె.వి. తిరుమలేశ్, శ్రీ కృష్ణ ఆలనహళ్ళి, ఈశ్వరచంద్ర, వివేక శానభాగ, జయంత్ కాయ్కిణి, డా॥ శాంతరామ సోమయాజి, కె. సత్యనారాయణ, చ. హ. రఘునాథ, స. రఘునాథ వ్రాసిన పన్నెండు కన్నడ కథలకు శ్రీ రంగనాథ రామచంద్రరావు తెలుగు అనువాదం ఈ సంకలనం.
* * *
ఈ పన్నెండు మూల కథల్లోని కథల శైలి, పాత్రల శైలులు, ఏ విధంగా సాగాయో నాకు తెలియదు. రంగనాథ తన అనువాదంలో కథన శైలి, పాత్రల శైలుల విషయంలో ఆయా రచయితల శైలీ విన్యాసాలను పట్టించుకున్నట్టు తెలుస్తుంది. తెలుగు పాఠకుడి కోసం వివిధ భాషా, సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలకు అనుగుణంగా రంగనాథ రామచంద్రరావు తగిన భాషా వ్యూహాన్ని అనుసరించినట్టు స్పష్టంగా వెల్లవుతుంది. ఈ అనువాద కథల శైలి సరళంగా, స్పష్టంగా, సూటిగా, తెలుగుతనాన్ని విడవకుండా హృద్యంగా సాగి హాయిగా చదివింపజేస్తుంది. ఇది రంగనాథ విజయం. చదివాక అలజడి ప్రారంభమవుతుంది. అది కన్నడ రచయితల ప్రతిభా, పాటవాల ప్రభంజనం.
- ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి
