• Prasiddha Hindi Kathanikalu - free
 • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
  • fb
  • Share on Google+
  • Pin it!
 • ప్రసిద్ధ హిందీ కథానికలు (free)

  Prasiddha Hindi Kathanikalu - free

  Pages: 189
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

సాహిత్య ప్రక్రియలో అనువాద రచనకున్న స్థానము విశిష్టమైనది. దీనివలన కలిగే ఉపయోగమూ చాలా గొప్పది. హిందీ భాషలో రచనలు చేసిన శ్రీ ప్రేమ్‌చంద్, శ్రీ జయశంకర ప్రసాద్, శ్రీ విశ్వంభరనాథ్ శర్మకౌశిక్, శ్రీమతి మహాదేవి వర్మల లాంటి వారు జగమెరిగిన సాహితీవేత్తలు. అలాంటి ఉన్నత స్థాయికి చెందిన వారి రచనలు ఎన్నో ఆలోచనలను, మనోవైజ్ఞానికతను ప్రతిబింబిస్తూ వుంటాయి. అవి పాఠకుల మనస్సుకు హత్తుకుని పదికాలాల పాటు పరిమళాలను వెదజల్లుతూ వుంటాయి. ఆయా రచనా సౌరభాలను మన తెలుగు పాఠకులకు కూడా అందించాలన్న ఉద్దేశ్యంతో ఈ ఇరవై హిందీ కథలను తెలుగులోకి అనువదించటం జరిగింది. కథలతోపాటు ఆయా రచయితల పరిచయాలను కూడా పొందుపరచటమైనది. "పేదోళ్ళను పీల్చి పిప్పి చేసి, గంగాతానాలు చేసి, గుళ్లూ గోపురాలు తిరిగే బడా బాబులు ఎందుకెల్తారు సొర్గానికి? ఆళ్లు నరకానికే పోతారు. నా కోడలు లాంటి వాళ్లే సోర్గానికి పోతారు" అంటూ 'కఫన్' అనే కథలో శ్రీ ప్రేమ్‌చంద్ తన పాత్ర 'ఘీసూ' చేత పలికిస్తారు. తాగుబోతుల, మనస్థితిని కళ్లకు కట్టినట్లు చిత్రించిన ఈ రచన ప్రేమ్‌చంద్ కథా సాహిత్యంలో పేరెన్నికగన్నది.

“నాయనా మనోహర్! నేను నిన్ను చంపుకున్నానురా, కాపాడలేకపొయ్యాను. వాడు పడిపోతున్నాడు. పట్టుకోండి” అంటూ రామేశ్వరి చేసిన ఆక్రందన మాతృత్వ ప్రేమను అద్భుతంగా చిత్రించి కథా సాహిత్యంలో తన స్థానాన్ని సుసంపన్నం చేసుకున్న శ్రీ విశ్వంభర్ నాథ్ శర్మ కౌశిక్ రచన 'తాయీ' అనే కథ మనోవైజ్ఞానిక రచనగా పేరుగాంచింది.

“సువర్ణ మల్లెతీగ కిందే గిల్లూ సమాధయ్యింది. ఆ చిన్న ప్రాణి ఏదో ఒక వసంత ప్రాభవాన, సువర్ణ మల్లెతీగకు, బంగారు రంగులో పచ్చని మొగ్గగా వచ్చి నాకు సంతోషాన్ని ఇవ్వటానికి ప్రయత్నిస్తుందని నా నమ్మకం" అంటూ 'గిల్లూ' అనే కథలో శ్రీమతి మహాదేవివర్మ చూపించిన భూతదయ పశుపక్షుల పట్ల ఆమెకున్న ప్రేమను చాటి చెప్తుంది. “ఈ దీప స్థంభం నుండి వెన్నెల కాంతిని వెలిగించి నా తండ్రి సమాధిని వెతుకుతాను. నాక్కూడా ఆకాశ దీపంలాగా వెలిగి ఇక్కడే కలిసి పోవాలనివున్నది” అన్న చంప మాటలు ఆమె, ఆత్మాభిమానానికి తార్కాణంగా వుంటాయి. 'ఆకాశదీప్' లాంటి కథ చిత్రణతో శ్రీ జయశంకర్ ప్రసాద్ ఉన్నత సాహిత్య శిఖరాలు అధిరోహించగలిగారు.

“వీరబాల ఎంత సౌభాగ్య శీలో? ఆమె మృత్యువు తర్వాత కూడా ఆమె ప్రేమికుడు, ఆమె సమాధిమీద ఈ రోజు వరకూ ఆమె ఆశయాల పుష్పాలనే అర్పిస్తున్నాడు” అంటూ 'చిన గార్' అనే కథలో డా. సరోజినీ కులశ్రేష్ గారు దేశభక్తినీ, త్యాగాన్నీ, అమర ప్రేమనూ కడు రమణీయంగా చిత్రించారు. ఇలాంటి మరెన్నో ఉత్తమ కధాకారుల ఆలోచనలతో నిండిన శ్రేష్ఠమయిన కధలు ఈ సంకలనంలో వున్నాయి. పాఠకులకే ఆ విషయం తేట తెల్లమవుతుంది.

- దాసరి శివకుమారి