-
-
ప్రసేన్ సర్వస్వం
Prasen Sarvaswam
Author: Prasen
Publisher: Yogi Publications
Pages: 270Language: Telugu
ఎప్పటికప్పుడు వ్యవస్థీకృతమవుతున్న అజ్ఞానాన్ని బద్ధలు కొట్టడానికి ప్రసేన్ నిత్యం ప్రయత్నిస్తున్నట్టు అతని కవిత్వం స్పష్టంగా చెపుతుంటుంది. ఈ ప్రయత్నం కవిత్వంలోనే కాక మరింత స్పష్టంగా వ్యాసాలలో కూడా చేసి చూపించాడు. దళిత కవిత్వంలో సెల్ఫ్ ఇంటరాస్పెక్షన్ కరువైనప్పుడు మాల బ్రాహ్మల దళిత ధాష్టీకం, ఆ విమర్శకుడి రెండో కన్నుగుడ్డిది వంటి వ్యాసాలు అందుకు ఉదాహరణ. కవిత్వం నిర్దిష్టత దిశ నుంచి వర్గ నిర్దిష్టతవైపు సాగిపోతున్నదన్న వాస్తవాన్ని గుర్తించినవాడు కనుకనే ఇది బి.సి. సూర్యోదయం అంటూ జూలూరి గౌరీశంకర్ పుస్తకానికి ముందుమాట రాయగలిగాడు. ఇతడు బీయింగ్కి నథింగ్నెస్కి మధ్య సంచరించకుండా రాజకీయ అస్థిత్వవాదంవైపు అడుగేస్తున్నాడు అని ఒక విమర్శక మిత్రుడు ఏదీ కాదు పుస్తకం వెనుక రాసిన మాటల్లో నిజం ఉన్నప్పటికీ ప్రసేన్ పొలిటికల్ ఎగ్జిస్టెన్షియలిజం నుంచి మెటాఫిజికల్ ఎంప్టీనెస్లోకి అడుగేస్తున్నాడన్నది కూడా వాస్తవం.
