-
-
ప్రపంచ, భారతదేశ నదులు - మహా సముద్రాలు
Prapancha Bharatadesa Nadulu Maha Samudralu
Author: A. Srikanth
Publisher: Victory Publishers
Pages: 137Language: Telugu
విజ్ఞానం అనంత మహాసముద్రం. ప్రతి ఒక్కరు దానిని సాధ్యమైనంత ఎక్కువగా పొందాలని కోరుకుంటారు. దీనికి వయస్సుతో నిమిత్తం లేదు. చాలామంది చాలా విషయాలలో నిష్ణాతులైనా వారికి తమ పరిసరాల గురించి కొద్దిగానే తెలుసు. ఇతర విషయాలతో పాటే తమ పరిసరాల గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ రకమైన వారి కోరిక తీర్చుకోవడానికి, వారి నిత్యజీవితానికి సంబంధించిన చాలా ప్రధానమైన విషయాల పరిచయం పొందేందుకు శాస్త్రీయ క్రమపద్ధతిలో ఒక విధానాన్ని రూపొందించాము.
ఉత్సాహాన్ని కలిగించే పద్ధతిలో ఆకర్షణీయమైన భాషాశైలి, రూపకల్పన గల పుస్తక కబందాన్ని ప్రకటించే ప్రణాళికను చేపట్టాము. మా పుస్తకాల కదంబానికి "ఇంకా ఎక్కువ నేర్చుకొందాం సిరీస్" అని పేరు పేరుపెట్టాము. పఠితలకు కేవలం ప్రధాన జ్ఞానాన్ని అందించటానికి మాత్రమే ఈ పుస్తకాలను తయారు చేయలేదు, క్రమపద్ధతిలో ముఖ్య జ్ఞానాన్ని అధ్యయనం చేయటానికి గూడ ఇవి ఉద్దేశింపబడ్డాయి. ఈ సిరీస్‌లోని విషయాలు తేలికగా అర్థం అయ్యేవిగా, స్పష్టంగానూ, ఆధునిక విషయాలతో కాలానుగుణంగా ఉండేట్లు రూపొందించబడినవి. విషయం అర్థం కావడానికి, మనస్సుకు హత్తుకోవటానికి తగినన్ని చిత్రపట దృష్టాంతాలు, పట్టికలు చేర్చబడ్డాయి.
విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, నిత్యసత్యాలతో తమ జ్ఞానము నిత్య నూతనంగా ఉంచుకొనగోరు పెద్దవారిని గూడ దృష్టిలో పెట్టుకొని ఈ పుస్తకాలు తయారుచేయబడుతున్నాయి.
పాఠకులు ఈ పుస్తకాలు చదవడం వలన, తాము జీవితంలో ఎదుర్కునే సవాళ్ళను స్వీకరించడానికి తగిన వ్యక్తులు కాగల్గుతారని ఆశిస్తున్నాము.
ఇది "ప్రపంచ, భారతదేశ నదులు", "మహా సముద్రాలు" అనే రెండు చిన్న పుస్తకాలు కలిసిన ఈబుక్.
- ప్రచురణకర్తలు
