-
-
ప్రముఖ తెలుగు సాంఘిక సినిమాలలో స్త్రీల జీవిత చిత్రణ
Pramukha Telugu Sanghika Cinemalalo Streela Jeevita Chitrana
Author: Dr. Ayyagari Sitaratnam
Publisher: Chinuku Publications
Pages: 196Language: Telugu
ఈ పుస్తకం రాయడానికి సీతారత్నంగారు చాలా సినిమాలు చూసి ఉంటారు. ఆమె పేర్కొన్న ఉపయుక్త గ్రంథ పట్టికను చూస్తే, సినిమాల గురించి పుస్తకాలు కూడా బాగానే చదివారు. అయితే ఆ పుస్తకాల అభిప్రాయాలకు పరిమితం కాక, తన స్వీయ విశ్లేషణకు ప్రాముఖ్యం ఇవ్వడం మెచ్చుకోదగ్గ విషయం.
గ్రంథంలో స్త్రీల సమస్యల్ని తెలుగు చిత్రాలు 1930 దశకం నుంచి 2007 వరకూ ఎలా చిత్రించాయన్న స్థూల వివేచన మంచి విశ్లేషణతో సాగింది. సమాజానికి దర్పణంగా సినిమా వ్యవహరించిన తీరును అనేక కోణాల నుంచి వివరించారు. అయితే, చాలా ప్రస్ఫుటంగా కనిపించిన కొన్నింటిని ఎందుచేతో విస్మరించారు. ‘ఇద్దరు భార్యల ముద్దుల భర్త’ల సినిమాల గురించి, వాటిని హాస్యాస్పందంగా చిత్రంచడం గురించి ఇందులో చర్చ జరగలేదు; అలాగే స్త్రీ పాత్రల విషయంలో కొన్ని మైలు రాళ్ల వంటి చిత్రాలు, కుటుంబం కోసం వివాహం మానేసిన ‘అంతులేని కథ’ నాయిక గురించి, వ్యక్తిగత సుఖం కంటే, సామాజిక బాధ్యత ముఖ్యంగా భావించిన వ్యక్తిత్వంగల స్త్రీగా ‘అంకురం’ చిత్రనాయిక గురించి ప్రస్రావించలేదు; వృత్తిలో ఎంత గొప్పగా ఉన్నా స్త్రీ తన స్త్రీత్వాన్ని వదులుకోకూడదని చెప్పే సినిమాలు వచ్చాయి; స్త్రీ యాజమానురాలయిన ఇంటిలో అశాంతి తప్పదని, పురుషుడి చేతిలో పగ్గం ఉన్నప్పుడే (ఆ పురుషుడు భర్త కావచ్చు; కొడుకూ కావచ్చు) సంసారంలో సుఖశాంతులుంటాయనీ చెప్పే సినిమాలు కోకొల్లలు; ఇటువంటి విషయాలు కూడ ఈ వ్యాసపరిధిలోకి వచ్చాయి. వీటిలో కొన్ని స్పృశించారు. కొన్ని మరచారు. అయితే ఏ రచనకైనా కొన్ని పరిమితులు విధించుకోవలసి వస్తుంది కనక, ఈ పుస్తకం తాను ప్రస్తావించిన విషయాల మేరకు ఒక మార్గనిర్దేశనం చేసిందని చెప్పవచ్చు.
- మృణాళిని

- ₹108
- ₹270
- ₹75.6
- ₹540
- ₹90
- ₹216