• Pramadakshari Kathamalika Tandri Tanaya
  • fb
  • Share on Google+
  • Pin it!
 • ప్రమదాక్షరి కథామాలిక - తండ్రి తనయ

  Pramadakshari Kathamalika Tandri Tanaya

  Pages: 192
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

తండ్రీ కూతుళ్ల మధ్య అనుబంధం చెప్పాలంటే ఆ భావాలు భాషకు అతీతం.

తండ్రీ కూతుళ్ల అనుబంధం గురించి సమాజంలోని వివిధ కోణాలనుండి కథలు రాయించాలని ఆలోచన వచ్చింది. ఎటువంటి అంశమైనా తమ ఆలోచనలను కథలు, కథానికలుగా మలిచే నేర్పున్న రచయిత్రులు తమకంటూ ఏర్పాటుచేసుకున్న ''ప్రమదాక్షరి'' ఫేస్‌బుక్‌ గ్రూపులోని వారికి తండ్రీ కూతుళ్ల మీద కథలు రాయమని చెప్పాను. వాళ్లందరికీ నేను చెప్పిన మాట ఒక్కటే... ఈ అంశం గురించి ఊహించకండి. మీచుట్టూ ఉన్న సమాజంలో మీకు ఎదురైన, తెలిసిన, విన్న, మీరు చూసిన తండ్రీకూతుళ్ల గురించి రాయండి. అది మంచైనా, చెడైనా ఫర్లేదు. ఎందుకంటే అందరు తండ్రులు మంచివాళ్లు, త్యాగమూర్తులు కారు. అలాగే అందరు కూతుళ్ళూ....

ఇదేవిధంగా వరుసగా వచ్చిన 24 కథల్లో ఒకదానికి ఒకటి అస్సలు సంబంధం లేకుండా మనసు పొరలకు సూటిగా తాకే విధంగా ఉన్నాయి. అందరూ వాస్తవగాథలనే కథలుగా మలిచారు. ఒక కథ చదివితే కంట నీరు ఆగకుంటే, మరొక కథ చదివితే కోపం ప్రజ్వరిల్లక మానదు. ఎందుకంటే ఈ రచనలు అందించిన వారంతా కూతుళ్లే కాబట్టి ఆ అనుభూతి సజీవంగా తమ అక్షరాల్లో ప్రతిబింబించారు. ఈ కథలన్నీ ఒక ఎత్తైతే, ప్రతి కథకూ మంథా భానుమతిగారు చేసిన విశ్లేషణ మరిన్ని వన్నెలద్దింది.

ఈ కథా సంకలనానికి తమ అక్షరాలను అందించిన 24 మంది రచయిత్రులకీ, ప్రత్యేకంగా మంథా భానుమతిగారికి మనఃపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

- జ్యోతి వలబోజు

Preview download free pdf of this Telugu book is available at Pramadakshari Kathamalika Tandri Tanaya