-
-
ప్రకృతి వైద్యం - ఆయుర్వేద చిట్కాలు
Prakruti Vaidyamu Ayurveda Chitkalu
Author: Akshara and Saraswati
Publisher: Saraswati Publication
Pages: 101Language: Telugu
ప్రకృతి వైద్యం
నిద్రలేమి: రాత్రి సమయమునందు గోరువెచ్చగా గానీ, భరించగల వేడినీటితో శిర స్నానము చేయవలెను. రాత్రి సమయమునందు తేలికగా జీర్ణమగు ఆహార పదార్థములను భుజింపవలెను. పాదములకు శిరసునకు ఆముదము బాగా రాసి, నీరు పోసి నవనీతము చేసి రుద్దాలి.
చెవిలో దురద, చెవిలో పుండు: నువ్వుల నూనెలో చిన్నఉల్లి (వెల్లుల్లి) రెబ్బలు వేసి బాగా కాచి ఆ నూనె వడగట్టి దినమునకు రెండు పర్యాయములు వేయవలెను. 2 లేక 3 దినములకు ఒకసారి గ్లిజరిన్ వేసిన పుల్లకి దూదిని చుట్టి మెల్లగా తుడవవలెను. చెవిలో గుడ్డపీలిక అడ్డుపెట్టి చెవి అంతా స్టీమ్ ఆవిరి పట్టాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారపదార్థములలో ద్రవ పదార్థములనే సేవించాలి. శనగపిండి మాంసములేగాక నమలవలసి వచ్చే పదార్థములు సేవించుట మానటం అవసరము.
కడుపునొప్పి: శొంఠి పొడి, వాము పొడి, ధనియాల పొడి సమముగా తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి మరగకాచి ఆ కషాయము సేవించినా కడుపు నొప్పి తగ్గును. చిటికెడు పరిమాణముగల పసుపు తగినంత, కొంచెము ఉప్పు ఒక గ్లాసు నీటిలో వేసి మరగకాచి చల్లారిన తర్వాత ఆ నీటిని సేవించినా కడుపు నొప్పి తగ్గును.
*****
ఆయుర్వేద చిట్కాలు
వాతం: వాతం అనగానే మనకి నొప్పి గుర్తొస్తుంది. కరెక్ట్‌గా మనకి నొప్పి తెలియాలంటే మన శరీరంలోని ‘నెర్వస్ సిస్టం’ పని చెయ్యాలి. కాబట్టి 'వాతం' అనే మాటని మనం అర్థం చేసుకోవడానికి శరీరంలోని మొత్తం 'నెర్వస్ సిస్టం' అధీనంలో ఉండి అన్ని క్రియలు వాతం వలన జరుగుతున్నాయి. అంతేకాకుండా మన శరీరంలో హార్మోన్ గ్రంథులు, మెటబాలిజమ్‌లో కొంతభాగం మన ఇంద్రియ వ్యవస్థలు కూడా 'వాతం' యొక్క ఆధీనంలోనే ఉంటాయి. మనం బయటి ప్రపంచంలో 'కమ్యూనికేట్' చెయ్యాలంటే వాతమే ముఖ్యమైనది. మనతో మనం కమ్యూనికేట్ చేసుకోవాలన్న ఈ వాతమే ప్రధానమే.
కఫం: శరీరంలోని జలధాతువు యొక్క అధిక్యతను కఫం అంటారు. దీనినే శ్లేష్మం అని కూడా అంటారు. మన శరీరంలోని సూక్ష్మ, స్థూలభాగాలన్ని ఒకదానితో మరొకటి సంబంధం ఏర్పరచుకోవడానికి శ్లేష్మమే కారణం. శరీరంలోని కఫం పెరగటం, తగ్గడం, జలతత్వంపైనే ఆధారపడి ఉంటాయి. అలాగే పంచభూతాలలోని పృధ్వి (భూమి) గుణం వలన కఫానికి 'స్థిరం' అనే గుణం ఏర్పడుతుంది. కఫం మనలోని 'ఓజస్సు' కి కారణం.

- ₹136.08
- ₹233.28
- ₹233.28
- ₹72
- ₹72
- ₹72