-
-
ప్రాకృత వ్యాసమంజరి
Prakruta Vyasamanjari
Author: Puttaparthi Narayanacharyulu
Publisher: Self Published on Kinige
Pages: 66Language: Telugu
Description
రసికులమగు మనకు ప్రాకృత కవులు గట్టి యిచ్చిన పాథేయము వెలగలది మాత్రమే గాదు, చాలా రుచిగలది గూడ. గౌడ వహము, ఆదిపురాణము, సేతుబందము, యశోధరచరిత్ర, మొదలగు కావ్యములు మెదడునకును, మనస్సునకును గూడ నానందమొసగునవి. జైన బౌద్ద వాఙ్మయములు, ప్రాకృత భాషలయందు విరివిగానున్నవి. నాటి సామాన్య భాష బహుశః ప్రాకృతమే యయి యుంటచే మతకర్తలు వానినే యాశ్రయించిరి. అందును, ప్రాకృతముల యందు, జైనమునకున్నంత వ్యాప్తి మరిదేనికినీ గానరాదు.
ప్రాకృతభాషాపోషణమునందు ఆంధ్రుల కీర్తియు, లెక్కకు రానిదిగాదు. వారి సభలలో ప్రాకృతమును బోషించిరి. కేవలము బోషించుటయేగాక దాముగూడ జేయిగలిగించుకొని బనిజేసిరి. రసఘుటికలవంటి మనోహరములగు జాటువుల నేర్చికూర్చి రూపమిచ్చిన శాతవాహనుడు మొదలగు వారాంధ్రులని యూహించుట కవకాశములున్నవి.
Preview download free pdf of this Telugu book is available at Prakruta Vyasamanjari
Login to add a comment
Subscribe to latest comments

- ₹270
- ₹378
- ₹72
- ₹86.4
- ₹216
- ₹72