-
-
ప్రజ్ఞాపారమిత
Prajnaparamita
Author: Bodha Chaitanya
Publisher: Dharmadeepam Foundation
Pages: 227Language: Telugu
16 ఏండ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా (ఈ దేశాన్ని కూడా కలుపుకొని) ఒక పిచ్చి కోలాహలం (చూడుడు 125 వ పుట మొదటి పేరా) చెలరేగుచుండిన ఆ దినాల్లో ఈ అనువాదకునిది వజ్రచ్ఛేదిక (Diamond Sutra) వెలువడింది. ఆ పుస్తకమే ఇప్పుడు ఈ పుస్తకంగా కొత్తరూపాన్ని పొందినది. అప్పటి లోపాలు కొన్ని సవరించడంతోబాటు శుష్కత్వాన్ని (dryness) నివారించే ఉపాయంగా ఈ అనువాదకుని అప్పటి మరో పుస్తకం బోధిచర్యావతారం నుండి కావలసినంతమేరకు విషయం తీసుకొని ఇందులో ఉపోద్ఘాతంగా మలచుకోవడం జరిగింది. దీనివల్ల ఈ కొత్తపుస్తకం రసవంతం (devoid of dryness) అయ్యిందనుకొంటున్నాను. మొత్తానికి ఇందులో ఆధ్యాత్మ జిజ్ఞాసువులు గమనించవలసిన విషయాలు చాలానే ఉన్నాయి. Edward Conze గారిని అనుసరిస్తూ హృదయసూత్ర (Heart Sutra) కూడా చేర్చాను. టిబెట్టు, చైనా, జపాను, వియత్నాం, మంగోలియా మొదలగు దేశాల్లోని బౌద్ధులు మిక్కిలి భక్తి శ్రద్ధలతో పారాయణం చేసే ఈ రెండు మహత్తర సూత్రాలను ఇముడ్చుకొన్న ఈ పుస్తకాన్ని ధర్మదీపం ప్రచురణగా ముద్రించి తెలుగు పాఠకులకు అందిస్తుంది.
Please provide ebook of this.