• Prajaswamyanni Chidimesina Rajakeeya Partilu
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రజాస్వామ్యాన్ని చిదిమేసిన రాజకీయ పార్టీలు

    Prajaswamyanni Chidimesina Rajakeeya Partilu

    Pages: 148
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రాజకీయ వ్యవహారాలు ప్రతిచోటా ఎలా ఉన్నాయో పరిశీలింపబడి, సరైనవని అనిపించే రాజకీయ సిద్ధాంతాలు ఉన్నాయి. అన్నీ ప్రజాస్వామ్యాన్ని గురించే ప్రస్తావిస్తాయి. కానీ ప్రజల యొక్క, ప్రజల చేత ప్రభుత్వం ఏర్పడటం ఎక్కడా లేదు. 19వ శతాబ్దంలో రూపొందించిన భావాలు, ఆదర్శ సిద్ధాంతాలకూ, నేటి ఆచరణకూ పెద్ద అఖాతం ఉంది. ఎందుకని? ఆధునిక కాలంలో ఆర్థించిన జ్ఞానం నుంచి మానవుడు తమ మేధస్సును, వివేచననూ ఉపయోగించి పూర్తి అవకాశాలు సాధించుకోలేకపోయాడు. వాస్తవ జీవితంలో సమస్యలను పరిష్కరించడానికి ఆధునిక జ్ఞానాన్ని అన్వయించలేకపోయారు. గత ఏభై సంవత్సరాలలో ఈ వైఫల్యం ఇంకా స్పష్టమయింది. మానవుడు నేటి నిస్సహాయత, నిరాశ దశలను చేరుకొన్నాడు. మానవ ప్రతిభ పూర్తిగా వ్యయం అయిపోయినట్లు అనిపిస్తున్నది. సిద్ధాంతాలు అద్భుతంగా ఉన్నప్పటికీ వాటిని ఆచరణలో పెట్టనందువల్ల నేటి సంకోభం ఏర్పడిందనడం సరికాదు. ఈ ధోరణి ఆత్మవంచనే. రాజకీయ సిద్ధాంతాలూ, ఆర్థిక విషయాలూ, ఆధునిక జీవిత సమస్యలను పరిష్కరించగలిగితే ప్రపంచం దారి తెన్నూలేన నేటి స్థితికి చేరేదేకాదు. ఉదారవాదం, ప్రజాస్వామ్యం, మార్క్సిస్టు సిద్ధాంతాలు ఆచరణలో పెట్టారు. అన్నీ లోపంతో కూడినవని తేలింది. అందుకే సంకోభం. నిరాశ నిస్పృహ. నిస్సహాయత జనించాయి. ఫాసిజాన్ని విమర్శించారు. ఖండించారు. అయితే ఆధునిక ప్రపంచంలో గాలివానవలె, అది ఎట్లా రాగలిగింది? ఫాసిజం తలెత్తిందంటే, ఇంతవరకూ, ఆలోచించి ఆచరణలో పెట్టిన ప్రజాస్వామ్యం విఫలమయింది.

సమకాలీన చారిత్రానుభవాన్ని చూస్తే, సంప్రదాయబ్ధమైన, విప్లవ పూరిత, సమాజిక, రాజకీయ ఆర్థిక భావాలు తృణీకరించదగినవని స్పష్టపడింది. ఉత్తమమైన స్వేచ్ఛా సమాజాన్ని నిర్మించడానికి కావలసినంత ఉత్పత్తి చేయటం సాధ్యమే. పరిస్థితిని వాస్తవంగా విశ్లేషించి చూచిన అనంతరం ఒకే ఒక నిర్ణయాన్ని రాబట్టవచ్చు. ఇప్పటివరకూ ఆదరించిన భావాలు. ఆచరించిన ఆదర్భాలు దోషపూరితమే కాక, ఎండమావులవంటివి కూడా ఇతర కాలాలలలో భిన్న పరిస్థితులలో, ఇవి బహుశ మంచి ఫలితాలను ఇచ్చేవేమో... నేడవి కాలదోషం పట్టినవి. అసంబద్ధమైనవి. 18, 19వ శతాబ్దాల భావాలతో 20వ శతాబ్ద సమస్యలను పరిష్కరించబోతే, వైఫల్యం, నిరాశ తప్పవు. ఇప్పటి వరకూ సాధించిన భౌతిక ప్రగతి స్థాయికి మానవుడి భావాలు అందుకోలేవు. భౌతిక ప్రగతికి భావ పరిణామానికీ ఉన్న అఖాతమే సంక్షోభానికి మరొక కారణం.

నిశిత పరిశీలకుడికీ, విమర్శనాత్మక విద్యార్థికీ సమకాలీన ప్రపంచ పరిస్థితి అంతా దిగజారిపోయిన పతనావస్థగా కనిపిస్తుంది. వినాశకారి అయిన యుద్ధంగానీ. ఆధునిక నాగరికత క్రమంగా పతనం గావటం కాని జరిగి మళ్ళీ అంధకార యుగంలోకి వెళ్ళవచ్చుననిపిస్తుంది. ఈ చిక్కు నుంచి మార్గాంతరం లేదా? మానవుడి ప్రతిభావ్యుత్పన్నతలు నేడు ఎన్నో అంచలుగా బహిర్గతమవుతున్నవి. అతడికి ఎక్కువ తెలియడమే గాక, గతంతో పోల్చితే అనేక పనులు చేయగల సత్తా సమకూడింది. కనుక నిరాశకు తావులేదు. ప్రమాదాలను రాకుండా చేయటం కూడా సాధ్యమే. ఈ నిర్ణయాన్ని బట్టి ఆలోచన సాగాలి. మానవుడి సృజన శక్తికి, ముందుకు పోవాలనే పిపాసకు ఏదో అడ్డుపడుతున్నది. మేధస్సుకు అవధులు ఏర్పడుతున్నవి. స్వేచ్ఛా హద్దులు విస్తరించుకోటానికి ఆటంకం ఏర్పడుతున్నది.

ఈ విషయాలన్నీగమనిస్తే కొత్తతత్వం అవసరమనిపిస్తుంది. అటువంటి తత్వాన్ని రూపొందించటానికి ముందు అనుభవ గుణపాఠంతో రాజకీయ ఆర్థిక సిద్ధాంతాలన్నిటినీ – సంప్రదాయమైనవీ, విప్లవాత్మకమైనవీ కూడా సమీక్షించి ఉంచవలసి ఉంటుంది. అప్పుడు మన నిర్ణయానికి బలం చేకూరుతుంది.

- నరిసెట్టి ఇన్నయ్య

Preview download free pdf of this Telugu book is available at Prajaswamyanni Chidimesina Rajakeeya Partilu