-
-
ప్రజా ఉద్యమంలో నేను
Praja Udyamamlo Nenu
Author: K.Krishna Murthy
Pages: 170Language: Telugu
ఇది ఒక వీరుని ఆత్మకథ. ఒక ధీరుని విప్లవ గాథ. ఎవరాయన? మన కృష్ణమూర్తిగారు. ప్రతిఘటన స్వభావం ఆయనకు ఉగ్గుపాలతోనే అబ్బింది. ఆనాటి ఫ్యూడల్ దర్పం, దోపిడీ, కిరాతకం ఇప్పటి తరానికి అంతగా తెలీదు. మన తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, ఇంకా మన పూర్వీకులు నిజాం అరాచకాలను, జమిందారీ పైశాచికాన్ని చవిచూశారు. అటువంటి కర్కశమైన వాతావరణంలో జన్మించిన కృష్ణమూర్తిగారు వయస్సు పెరిగే కొద్దీ పేదలపై సాగుతున్న కిరాతకత్వాన్ని అవగాహన చేసుకున్నాడు. ఎన్ని కష్టనష్టాలు వచ్చినా చలించకుండా ఫ్యూడల్ దురంతాలకు ఎదురొడ్డి పోరాడాలని నిశ్చయించుకున్నాడు. ఆయన బాల్యంలో ఉండగానే ఆంధ్ర మహాసభా పుట్టి పెరుగుతూ వచ్చింది. పదకొండవ మహాసభను గురించి విన్నాడు. పన్నెండవ మహాసభ ఆయన విప్లవ ఆలోచనలకు అనలు వేసింది. ఇక ఆ తర్వాత నుంచి పోరాటం - పోరాటం - ఒకటే పోరాటం. ఎప్పుడూ మడమ తిప్పలేదు. చివరికంటా కొనసాగాడు.
- పాటూరు రామయ్య, అధ్యక్షులు, ఆల్ఇండియా వ్యవసాయ కార్మిక సంఘం
