• Praja Prabhatam November 2013
  • Ebook Hide Help
    ₹ 20 for 30 days
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రజా ప్రభాతం నవంబరు 2013

    Praja Prabhatam November 2013

    Publisher: S.G. Foundation

    Pages: 40
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తుంచినా సరే, పూలు స్త్రీల సిగలో పరిమళ భరితంగా విరిసినట్టు, ప్రజలు కూడా అంతే. ఎంత వంచించినా ఏదో నమ్మకంతో, ఆశతో నాయకులను అందలాలు ఎక్కిస్తారు. ప్రజా ప్రతినిధులుగా చట్టసభల్లో నిద్రపోతూ సెల్‌ఫోన్‌లో బూతు బొమ్మలు చూస్తూ సభల గౌరవాన్ని కించపరిచినా, ప్రజలు నాయకుల్ని ఎన్నడూ అవమానపరచలేదు. ప్రజాస్వామ్యం భంగపడుతున్నప్పుడు కూడ త్రివర్ణ పతాకాన్ని గుండెలనిండుగా నింపుకునే జనం, పస్తులతో కాలం ముసురుతున్నా సరే, దేహాన్ని దేశంగా భావించి కష్టించి, ఉత్పత్తులు పెంచే జనం కళ్ళల్లో కొత్త వెలుగులు పూయించాలని 'ప్రజాప్రభాతం' తొలి అడుగు వేస్తున్నది.

మట్టి మనుషుల ఇళ్ళముందు సంక్రాంతి ముగ్గులాగా నవ్వులు పూయించాలని ఆడపడుచుల హృదయాల్లో సమానతా దీపాలు వెలిగించాలని, పసిపిల్లల చేతులకందేలా ఇంద్రధనస్సులను సృష్టించాలని, అచ్చమైన మనిషి కంటివెలుగులా లోకాన్ని పరిచితం చేయాలని ప్రజా ప్రభాతం మీ చేతుల్లోకి నెలల పాపాయిలా వస్తున్నది. ఎంతో మంది నిష్కల్మష మనస్కులు, ప్రజాస్వామిక శక్తులు ఈ అక్షరాలకు కాచుకోవడం ద్వారా కల్లలులేని ఎల్లలు దాటని ప్రపంచాన్ని పాఠక లోకం ముందు ఆవిష్కృతం చేయటం 'ప్రజా ప్రభాతం' అభీష్టం. వివాదాలను వాదంగా విరజిమ్మలేం. వంచనలని నిజాలుగా ప్రజల మనఃఫలకాలపై ముద్రించలేం. మరీ ముఖ్యంగా అక్షరాలను వ్యాపారంగా కుదించలేం. శాస్త్ర విజ్ఞానం, సాహిత్యం, రాజకీయం, ఆటలు, యువత, మహిళ, కళలు, ఆప్యాయతలు, కలబోతలతో 'ప్రజా ప్రభాతం'ను ముచ్చటగా తీర్చిదిద్ది పాఠకులకు అందించాలనుకుంటున్నాం. ప్రతి పేజీని మానవసంబంధాల బడిలో దిద్దిన అక్షరంగా మలచి అందిస్తామని హామీ ఇస్తున్నాం.

ప్రజాస్వామ్య పరిమళభరితమైన సుగంధాన్ని పరీవ్యాప్తం చేస్తూ సమున్నత మానవతా విలువల్ని నెలకొల్పడం 'ప్రజా ప్రభాతం' లక్ష్యం. కొత్త మాస పత్రిక తొలి సంచిక ఇది.

Preview download free pdf of this Telugu book is available at Praja Prabhatam November 2013