-
-
ప్రాచీన సాహిత్య దర్శనము
Praacheena Sahitya Darsanamu
Author: Muvvala Subbaramaiah
Publisher: Muvvala Perumallu and Sons
Pages: 244Language: Telugu
సంస్కృతాంధ్ర సాహిత్యాలలో పథ నిర్మాతలనదగిన కవులు, ఆ కవులకు సంబంధించిన ఉత్తమ కావ్యాలను ఒకేచోట పరిచయం చేయడం "ప్రాచీన సాహిత్య దర్శనము" ప్రత్యేకత. కావ్యంలోని కథాంశాన్ని సరళవచనంలో చెబుతూనే, దానికి ముందు కవిని పరిచయం చేసిన తీరు బహు బాగుంది. ఈ పరిచయం సంక్షిప్తంగానే వున్నా, మనకి మాత్రం సాకల్యమైన అవగాహన కలిగిస్తున్నది.
కాళిదాసు మొదలు, శూద్రకుని వరకు సంస్కృత కవులు, ఇక తెలుగులో అల్లసాని పెద్దన మొదలు, నాచనసోముని వరకు సుప్రసిద్ధ కవులు మనకి రేఖామాత్రంగా సాక్షాత్కరిస్తారు.
ఈ గ్రంథం చదివాకా, ధీమాన్యులైన కవుల గురించి, వారి అసామాన్య కావ్యల గురించి సామాన్యులకు కూడా తెలుస్తుంది. పద్యాలు, శ్లోకాలు అనగానే, సాహిత్యానికి దూరంగా పారిపోయే వర్తమాన తరాన్ని, తిరిగి సాహిత్యానికి కాస్తంగా సమీపానికి చేరుస్తూందీ గ్రంథం. ఇదొక పరమ ప్రయోజనం. సమగ్రంగా గ్రంథస్థం కాని కవుల జీవిత చరిత్రల్లోని భిన్న భిన్న కథనాలను యధోచితంగా ప్రస్తావించడం వలన, ఆ కవుల గురించి మరింత చదవాలనే ఆసక్తి కలిగించడానికి ఈ గ్రంథం దోహదకారి అవుతుంది.
- డా. వోలేటి పార్వతీశం
