• Potanamatya Bhagavata Parichayamu Prathama Skandhamu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • పోతనామాత్య భాగవత పరిచయము - ప్రథమ స్కంధము (free)

    Potanamatya Bhagavata Parichayamu Prathama Skandhamu - free

    Pages: 173
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ ప్రధమస్కంధం నిజానికి భాగవతానికి ఉపోద్ఘాతం లాంటిది. “శ్రీకైవల్యపదంబు...” పద్యం ఈస్కంధములో మొదటిది. అలా కైవల్యప్రాప్తికి ఈ గ్రంథం అంటూనే భాగవతం అంతటిని సూచించారు బమ్మెర వారు. ఈ స్కంధాన్ని ఉపోద్ఘాత / పరిచయాలకు వాడినట్లుంటుంది. ఉపోద్ఘాతంలో దేవతాస్తుతులు, పాత రచయితలను గౌరవించిన తీరు, సమకాలీనులను మన్నించిన తీరు, భావి కవులకు ఆశీస్సులు అందించిన విధానము పోతన వ్యక్తిత్వ విశిష్టతను చెప్తున్నాయి.

“ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి..” మానవులకు అంకితమివ్వను అనే దృఢనిర్ణయం వ్యక్తపరచి నిజజీవితంలో దానిని అమలు చేసిన మహానుభావుడు కనిపిస్తాడు.

“భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు..” అంటూ ఆవిష్కరించిన సవినయ ఆత్మవిశ్వాసం బహుళ ప్రశంసనీయం.

“శ్రీకృష్ణాయదుభూషణా..”అనే అద్భుతపద్యంఉన్నకుంతిస్తుతి. “కుప్పించియెగసినఁ" పద్యమాణిక్యం ఉన్న భీష్మస్తుతి. “గురుభీష్మాదులుగూడి..” అని నారాయణుని స్మరిస్తూ నరుడు కృష్ణనిర్యాణం చెప్పటం. భాగవతం అంటేనే పారీక్షితం అని పేరు పడటానికి కారణమైన పరీక్షిత్తుని పుట్టుక, శాపం పొందుట మున్నగు ఎత్తుగడలతో విరాజిల్లుతోంది యీస్కంధం.