-
-
పోతబొమ్మ
Pota Bomma
Author: Sripada Swatee
Publisher: J.V.Publications
Pages: 124Language: Telugu
Description
ప్రవహిస్తే గదా...
కవిత రాయాలంటే
ముందు నువ్వు కదా
కవిత్వమై ప్రవహించాలి
లక్షల లక్షల అక్షరాలు
చూపులగుండా పయనించవచ్చు
వేలాది కవితా రూపాలు
నాలుక కొసన నర్తించవచ్చు
అయినా కవిత్వం ఎప్పుడూ
ఒక అంతర్జనితమే కదా....
ఎక్కడ ఎప్పుడు ఎలాగో ఏమిటో
ఎవరు చెప్పగలరు?
ముందే నిర్ణయించుకున్న ప్రయాణం కాదు గదా
మనసావాచా మునిగి తేలితే గదా
నువ్వు కవిత్వమై ప్రవహించేది?
ప్రవాహానికి దారీ తెన్నూ
పరిసరాల వివరాలెందుకు
కవిత్వమే కదా చుక్కాని
కాలాన్ని నీ ఒడిలో పసిపాపగా మార్చేదీ
సంతృప్తిని మనసు పెరట్లో సాగు చేసేదీ
విశ్వరూప రహస్యం గుసగుసలుగా
విప్పి చెప్పేదీ
కవిత్వమై ప్రవహిస్తే గదా....
- స్వాతీ శ్రీపాద
Preview download free pdf of this Telugu book is available at Pota Bomma
Login to add a comment
Subscribe to latest comments
