-
-
"పాజిటివ్ థింకింగ్" తో సక్సెస్
Positive Thinking Tho Success
Author: Dr. M. V. Rao
Publisher: Victory Publishers
Pages: 168Language: Telugu
"ఒక పనిని 'నేను చేయగలను' అన్నా నువ్వు రైటే, 'చేయలేను' అన్నా రైటే. ఎందుకంటే 'చేయగలను అనే నమ్మకం నీకుంటే చేయగలుగుతావ్'. చేయగలననే నమ్మకమే - పాజిటివ్ థింకింగ్." అంటారు డా॥ యం.వి. రావు.
* * *
ఈ పుస్తకంలో విషయ సూచిక, తొలిపలుకులు చూచిన ప్రతివారికి పుస్తకం గురించి ఒక మంచి అవగాహన వస్తుంది. చదవాలనే జిజ్ఞాస కలుగుతుంది. ముఖ్యంగా పాజిటివ్ థాట్స్ ఎలా డెవెలప్ చేసుకోవాలి, అసలు నెగటివ్ థింకింగ్ ఎలా ఏర్పడుతుంది; ఆలోచనల్లో వక్రీకరణ, 10 రకాల వక్రనమ్మకాలు (థింకింగ్ డిస్టార్షన్స్), వాటిని ఎలా సరిచేసుకోవాలి; అసలు ఆలోచనలు ఎక్కడ ఎలా పుడతాయి, నెగటివ్ నుంచి పాజిటివ్‌గా ఎలా మారాలి; హెల్థీ నెగటివ్ అంటే ఏంటి; ప్రోయాక్టివ్ థింకింగ్; జీవితంలో ఒక వ్యక్తి పోషించవలసిన వివిధ పాత్రలు; విలువలు, భయం పోగొట్టుకోడం; ఎమోషనల్ ఇంటలిజెన్స్; ఆనందంగా ఎలా జీవించలి; మైండ్ అండ్ బాడీ మెడిసిన్; ఆధ్యాత్మికత; యూనివర్సల్ లాస్; మెడిటేషన్ మొదలైన అంశాల గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేసి చర్చించి, వివిధ వర్గాల వారికి అనగా స్టూడెంట్స్‌కు, పేరెంట్స్‌కు, ప్రొఫెషనల్స్‌కు, స్త్రీలకు, ఆనందంగా ప్రశాంతంగా విజేతలు కావాలనుకున్న ప్రతివారికి ఉపయోగపడేలా ఈ పుస్తకం వ్రాయబడింది.
- ప్రచురణకర్తలు
