-
-
పూతరేకులు
Pootarekulu
Author: Sudhama
Publisher: Self Published on Kinige
Pages: 62Language: Telugu
Description
పూతరేకులు పేరుతో సుధామ వడ్డించిన హస్యపు గుళికలు ఇవి. హాయిగా నవ్విస్తునే చురుక్కుమనిపిస్తాయి. మచ్చుకు కొన్ని:
* * *
''సృష్టిలో తీయనిది స్నేహమేనోయి అన్న మాట బాపురమణల విషయంలో వర్తించదు'' అన్నాడు శ్రీరమణ''ఏం ఎందుకు?'' ఆశ్చర్యంగా అడిగాడు వరప్రసాద్
''స్నేహం'' సినిమా వాళ్లిద్దరూ తీసారుగా నవ్వాడు శ్రీరమణ
* * *
S.M.S - సరదా మాటల శైలి అనే శీర్షిక నుంచి:
"నా సెల్‌ఫోన్ ఇన్‌బాక్స్‌లో బోలెడు జోకులున్నాయి. అవన్నీ పంపలేను. చాలా సమయం తీసుకుంటుంది. అందుకని కేవలం ఒక్కజోకు పంపుతున్నా- నువ్వు చాలా అందంగా ఉంటావు."
* * *
''ఓ కాంపౌండ్సెంటెన్స్ చెప్పు'' అని ఇంటర్వ్యూలో అడిగితే - వెంగళప్ప ''నోటీసులు అంటించరాదు'' అని చెప్పాడు.''అదేమిటి'' - అని అడిగితే ''కాంపౌండు మీద అలాంటివేగా ఉండేవి'' అన్నాడట.
* * *
ఇలాంటివి ఈ పుస్తకంలో బోలెడు ఉన్నాయి. ఆలస్యం ఎందుకు? చదివి హాయిగా నవ్వుకోండి.
Preview download free pdf of this Telugu book is available at Pootarekulu
Login to add a comment
Subscribe to latest comments
