-
-
పూర్వి
Poorvi
Author: Pothuri Vijayalakshmi
Publisher: Sri Rishika Publications
Pages: 131Language: Telugu
తెలుగు పాఠకులను నవ్వుల సంద్రంలో ముంచి తేల్చగల రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి గారు. పొత్తూరి విజయలక్ష్మి హాస్య కథలు, ఆనందమే అందం, ఇంటింటి రామాయణం వంటి కథా సంపుటులతో తెలుగిళ్ళకు నవ్వుల తోరణాలు కట్టిన విజయలక్ష్మి గారి కలం నుండి వెలువడిన మరో కథాసంపుటి "పూర్వి".
*****
హాల్లోంచి చప్పుడు వినిపించింది.
“ఏవండీ మీరా? కోతా?” అడిగింది సీత.
సమాధానం లేదు. “మిమ్మల్నే... ఏవిటా శబ్దం? మీరా? కోతా?” మళ్ళీ అడిగింది.
మళ్ళీ చప్పుడయింది. చప్పుడే తప్ప మాటా మంతీ లేదు. కోతేమో అనుకుని కూడా లేవడానికి బద్దకించింది. మధ్యాహ్నం భోజనాలు అయ్యాకా ఓ మంచి పుస్తకం పుచ్చుకొని పడక్కుర్చీలో నడుం వాల్చి సేదదీరడం ఆవిడకి అలవాటు. ఆ సమయంలో ఫోనొచ్చినా తియ్యదు. డోర్ బెల్ మోగినా లేవదు. అందుకే కోతి కాదులే ఈయనే అయి ఉంటారు అనుకుని పుస్తకంలోకి దృష్టి సారించింది.
అంతలో ధడాలుమని శబ్దం. ఆ వెంటనే “ఎవరదీ? సీతా? నువ్వా? కోతా?” అని రామారావు కంఠం వినిపించింది.
శ్రీరామచంద్రా ఈయన కాదు. కోతే! అనుకుని చివాల్న లేచింది.
