• Poolandoy Poolu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పూలండోయ్ పూలు

    Poolandoy Poolu

    Publisher: Vinutna Publishers

    Pages: 139
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


ప్రసాదమూర్తి కవిత్వంలో ఒక గొప్ప సారళ్యం - ఒక సహజ వ్యక్తీకరణ - అలంకారిక వ్యక్తీకరణ - ఒక హాయిగా వెళ్ళిపోయే గుణమేదో - గొప్పగా చదివించే లక్షణమేదో ఉంది. ఒక తాజాదనం - పొద్దుటి పుళ పరిమళం ఉంది. అందుకే నేనన్నా.. ప్రసాదముర్తి వస్తుతః కవి అని. దేన్ని ముట్టుకున్నా కవిత్వం చేయగల సత్తా, కల్పనాశక్తి పుష్కలంగా ఉన్నవాడు ప్రసాదమూర్తి.

- కె. శివారెడ్డి

* * *


పూలండోయ్ పూలు
జ్ఞాపకాల జాజులు
మమకారాల మందారాలు
మమతల మల్లెలు... కలల కనకాంబరాలు
చలాకీ ఊహల గులాబీలు...
ముద్దు చూపుల ముద్దబంతులు
పాటల పారిజాతాలు... ఆశల సంపెంగలు
పూలండోయ్ పూలు


బతుకుల్ని తూకం వేసి అమ్ముకునే చోట
ఈ పరిమళాల బజారులోనే
నాకు బతుకు పరమార్థం దొరికింది


మనుషులంతా పువ్వులైపోయినట్టు...
పువ్వులు, మనుషుల్ని మూటలుగట్టి
మంచికీ మానవత్వానికీ మధ్య
ఆదానప్రదానాలు చేస్తున్నట్లు...
అక్కడోసారి వాసన చూశాకే
రోజూ సూర్యుడు తూర్పు కొండెక్కి
ఒళ్ళు విరుచుకుంటున్నట్టు
ఒకటే కలలు కలలు
పూలండోయ్ పూలు

Preview download free pdf of this Telugu book is available at Poolandoy Poolu