-
-
పూలమనసులు
Poolamanasulu
Author: Madireddy Sulochana
Publisher: Navodaya Publishers
Pages: 258Language: Telugu
అది ఆమె వివాహమయిన అయిదోరోజు కాబోలు, నిద్రరాక, ప్రొద్దుటే లేచి ఏటి ఒడ్డున కూర్చున్నది. ఎండపొడలు వస్తున్నాయి. కాని ఆమెకేం వేడిగా లేదు. చాలాసేపటికి పరిసరాలను పరికించింది. ఆమెకెదురుగా వున్న బోసిచెట్టుకు దుప్పటి కట్టబడి వుంది. అది మొదటినుండు వుందా? అనే ప్రశ్న ఆమెలో బయలుదేరింది. అటు యిటూ చూసింది. కొంచెం దూరంలో ఒక రాయిపై కూర్చుని వేపపుల్లతో దంతధావనము చేసుకుంటున్నాడు. అతన్ని చూడగానే ఆమెకు మండిపోయింది. తన వెనకాలే యెందుకు తిరగాలి? విసురుగా లేచింది.
''ఆ దుప్పటి ఎవరు కట్టమన్నారు?'' అతని వంక తీవ్రంగా చూసింది.
''ఒకరు చెపితే చేసేవాడు కాడు ఈ రామ్'' పుల్ల పారవేసి నీటితో నోరు పుక్కిళించాడు.
''అదే, యెందుకు కట్టారు?''
''నీ అందాల మోము కందిపోతుంది - అప్పుడే బగ్గలు చూడు, అరుణిమ దాల్చాయి.'' దగ్గరగా వచ్చి బుగ్గలు రాశాడు. విసురుగా దూరంగా నెట్టింది.
''కోపమేల రాధా! దయచూప వేల నాపై -'' ట్యూన్ గొణుక్కుంటూ ముందుకు వెళ్ళాడు. అతని వంకే చూస్తోంది. కొద్దిదూరం వెళ్ళి తిరిగి చూశాడు. అతని చూపులలోని ఆరాధనను అహంకారంతో అర్థం చేసుకోలేకపోయింది. విసవిస నడిచి యింట్లోకి వెళ్ళిపోయింది. అది ఎంత మధురానుభూతి, అలా రాయిలా ఎలా వుండగలిగింది? ఆమె కళ్ళు వర్షించసాగాయి. ఉదయపు టెండయినా, వేసవికాలపు టెండ, ఆమె ముఖం కందిపోయింది. మృదువైన హస్తం ముఖం తిప్పుకోవటంతో అదిరిపాటుతో అటు తిరిగింది.
Iwant this document for online reading. Pl. Upload
Super