• Police Police
  • Ebook Hide Help
    ₹ 315
    350
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పోలీస్ పోలీస్

    Police Police

    Pages: 359
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


అమృత్, భవ్య, లంకేష్ టివి చూస్తూ కూర్చున్నారు.
అవతలి బస్‌టాప్ వరకూ ఆటోలో వచ్చి, ఆ బస్‌టాప్‌లో సిటీబస్ ఎక్కి, ఇవతల దిగి, ఆ సందు చివర వరకూ రిక్షాలో వచ్చి రెండు నిమిషాలు నడిచి వచ్చింది స్వరూప.
ముగ్గురి ముఖాలూ విప్పారినయ్. “చెకోరి పక్షుల్లా నీకోసం ఎదురు చూస్తున్నాం. స్వరూపా... కాయా పండా, విశేషాలు” అన్నది భవ్య.
సోఫాలో అమృత పక్కన కూర్చున్నది స్వరూప.
“మొత్తం మీద ఆలోచిస్తే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనిపించాడు. పేరడిగాడు. స్త్రీ అని చెప్పాను.”
“వెరీ నైస్. చేస్తానన్నాడా” తాపీగా అడిగాడు లంకేష్, “చూస్తానన్నాడు”. ముగ్గురి ముఖాల్లో ఆదుర్దా.
"అంతేనా”
“చేతిలో చెయ్యి వేశాడు. ఇక మిగతా విషయాలు పద్మనాభరావు చూసుకోవాలి” అన్నది స్వరూప. చెరొక చెంపా ముద్దు పెట్టుకున్నారు.
ఫ్రిజ్‌లో డ్రింకులు నలుగురూ తాగారు.
“ఈ రోజుల్లో ధర్మం నాలుగు పాదాల మీదా నడుస్తున్నది. డెకాయిట్, రేప్, బ్రోతల్, కరప్షన్ ఇవ్వే ధర్మదేవత నాలుగు పాదాలు. కాదంటారా.”
ముగ్గురికీ నోట మాట రాలేదు. స్వరూప కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి. ఎవరికీ అర్థం కాలేదు. "సన్యాసినిగా మారాలనుకున్నావా స్వరూపా.”
“కాదు. కాల్చిపారెయ్యాలనుకుంటున్నాను.” కళ్ళు తుడ్చుకున్నది. మాటలో కోపం, కాఠిన్యత. “ఎవర్ని"
“పోలీసుల్ని, గత జన్మ, పునర్జన్మ అనేవి ఉంటే ఎంతో పాపాల్ని గతజన్మలో చేస్తేగాని ఈ జన్మలో పోలీసుల భార్యలుగా పుట్టరు.”
ముగ్గురూ నవ్వేశారు.
“మనంచేస్తున్నది పుణ్యకార్యం అనుకుంటున్నావా” నిర్లిప్తతగా చూస్తూ అన్నది అమృత.
"కాకపోవచ్చు. అవర్ స్ట్రగుల్ ఈజ్ ఫరెవర్ ఎగ్జిస్టెన్స్. ప్రైవసీకీ, సీక్రెసీకీ ప్రాధాన్యం అన్నది కుక్కలకన్నా హీనం.”
“నీ కోపానికీ, తాపానికి కారణం”
రాఘవరావు, కస్తూరి విషయాలు చెప్పింది స్వరూప. నివ్వెరపోయారు. నోట మాట రాలేదు.
ముగ్గురూ లంకేష్ వైపు చూశారు.
మర్నాడు పత్రికల్లో వార్త.

Preview download free pdf of this Telugu book is available at Police Police