-
-
పొద్దు పొడుపు
Poddu Podupu
Author: Annavaram Devender
Publisher: Saahithi Sopathi
Pages: 84Language: Telugu
అన్నవరం కవిత్వంలోని వస్తువుని మూడు రకాలుగా చెప్పాలి. ఒకటి ప్రపంచీకరణపై ధిక్కారం, రెండవది తెలంగాణా ప్రాంతీయ అస్తిత్వనినాదం, మూడవది దళితవాదం. అన్నవరం రచనలోని పరికరాల ప్రగాఢత వల్ల అన్నవరంలో ప్రత్యేక స్వరముంది. ప్రధానంగా ఏ పర్యవసాన్నయినా అన్నవరం దర్శించే కోణం భిన్నమైంది. ప్రపంచీకరణని సామాజిక, రాజకీయ, ఆర్ధిక కోణాల్నుండే గాక పల్లె సంస్కృతి సంప్రదాయాల నుండి చూస్తాడు. వస్తుముఖంగా కులవృత్తుల ప్రతావన ఉన్నప్పుడు ఆర్ధిక, సామాజిక స్పృహలు కనిపిస్తాయి కాని అది ప్రధాన ఉద్వేగ క్షేత్రం గాదు. వస్తు క్షేత్రాన్ని అనుసరించి చూస్తే కవిత్వమంతా పల్లె వాతావరణమే కనిపిస్తుంది. ప్రపంచీకరణని ధిక్కరించినా, ప్రాంతీయ అస్తిత్వ చైతన్యమైనా దళిత నినాదమైనా ఈ క్షేత్రంలో పెద్దగా మార్పు లేదు.
అన్నవరంలో గుప్తంగా కొన్ని నిర్మాణాంశాలున్నాయి. చిన్న చిన్న వాక్యాలు చెప్పటం, అనుకరణ పదాలు వాడటం, మూడు నాలుగు వాక్యాలను రెండు, రెండు బంధాలుగా వాడటం. ఎక్కువగా నామ వాచకాల్లాంటి పదాలు. కొన్నిసార్లు వాక్యాలు ముక్తకంగా ఉంటాయి. తెలంగాణా జీవద్భాషలోని ఉద్వేగాన్ని, వర్ణనాత్మకతని, సంక్షిప్తతని మరింత ప్రగాఢంగా వ్యక్తీకరిస్తాడు.
భాషాముఖంగా, వస్తువు ముఖంగా కూడా అన్నవరం కవిత్వం తెలంగాణా నుడికారపు ఔద్వేగిక జీవధార.
- ఎం. నారాయణ శర్మ
