-
-
పితృ తర్పణము మహాలయ పితృ పక్షము బ్రహ్మయజ్ఞము విధానము
Pitrutarpanam Mahalaya Pitru Pakshamu Brahmayagnamu Vidhanamu
Author: Bhaskarabhotla Janardhana Sharma
Publisher: Bhaskarabhotla Janardhana Sharma
Pages: 43Language: Telugu
శ్రాద్ధములు, పితృ దేవతల పూజ, తర్పణాదుల గురించి అనేక సందేహములు అనేకులకు తలెత్తుతున్నాయి. చనిపోయినవారికి ఈ పూజలు, శ్రాద్ధాలేమిటి? వారినెందుకు పూజించా ? ఆ పూజలు వారికెలా అందుతాయి? దేవతలలాగా వారికి వరాలిచ్చే శక్తి ఉంటుందా? వారుకూడా ఒకప్పుడు మనలాంటి మనుషులేగా? ఈ పూజలు చేయకపోతే నష్టమేమిటి? ఇలాంటి ప్రశ్నలతో చాలామంది అయోమయానికి గురి యవుతున్నారు.
కాలము గడిచేకొద్దీ, మన సాంప్రదాయాలు, ఆచారాల వెనుక అర్థం తెలియక, అసలు మన సాంప్రదాయాలే తెలియక , వీటిని నిరాకరించే వారి సంఖ్య ఎక్కువవుతున్నది . వీటిని గురించి తెలియచెప్పేవారు లేకపోవడము, ఉన్నా, అక్కడో ఇక్కడో చదివినది, వారు వీరు చెప్పినది విని దానికి తమ ఊహా శక్తి జోడించి మసాలాలు కలిపి, వాణిజ్య ప్రయోజనాలకోసం చిలవలు పలవలు అల్లి సందేహాలను తీర్చకపోగా, ఇంకా కొత్త సందేహాలను సృష్టిస్తున్నారు. వీటి గురించిన సమగ్రమైన సమాచారం మనకు వివిధ పురాణాలలోనూ , శాస్త్రాలలోనూ వేదం లోనూ ఉంది. అవే మనకు ప్రమాణము. ఆ విషయాలను అనేక ఋషులు వివరించి యున్నారు. కాబట్టి శాస్త్రాలలో ఏమి చెప్పిఉన్నారు, ఎలా చెప్పిఉన్నారు అనే విషయాన్ని పరిశీలిస్తే అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. నిజానికి ఈ విషయాలపై సమాచారము చాలా అధికముగా లభ్యమవుతున్నది. ఉన్నవాటిలో విషయాన్ని సరిగ్గా అన్వయించే ప్రయత్నమే ఈ పుస్తకము.
గరుడ పురాణము, నంది పురాణము, ఆదిత్యపురాణము, మను, దేవల స్మృతులు, హేమాద్రి శృతి , మత్స్య , కూర్మ పురాణాలలో కూడా విశేషమైన సమాచారముంది . నిర్ణయ సింధువు కూడా ఈ విషయముపై దీర్ఘమైన వివరణలను ఇచ్చింది . వీటిలోని విషయాలను క్రోడీకరించి పై ప్రశ్నలకు సమాధానము తెచ్చుకొని అందరికీ అర్థమగునట్లు వీలైనంత క్లుప్తముగా ఇక్కడ పొందు పరచినాము.
ఈ కాలము తెలుగు వారు దేశదేశములందు నివశించుచున్నారు. వారికి ఈ కార్యములు చేయించు బ్రాహ్మణుడు దొరకుట కష్టము. స్వదేశములో కూడా అనేకులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. కాబట్టి ప్రతిదానికీ ఒకరిపై ఆధారపడకుండా వీలైనంత వరకూ ఎవరికి వారు కొంత నేర్చుకొని ఇంటిలోనే తామే చేసుకొనుట ఒక ప్రత్యామ్నాయము మాత్రమే.
ఈ పుస్తకమునుపయోగించి బ్రాహ్మణుడు దొరకకున్ననూ ఎవరికి వారే గృహమందు తర్పణములు, బ్రహ్మ యజ్ఞము వంటి కార్యములు చేసుకొనవచ్చును.
How to open purchased books
Very Timely purchase before Putru Pakashamulu
can i get a print copy of this book
Where in Hyderabad the book is available?