-
-
పింగళి సూరన కళాపూర్ణోదయం
Pingali Soorana Kalaapoornodayam
Author: Rentala Gopalakrishna
Publisher: Jayanthi Publications Vijayawada
Pages: 120Language: Telugu
పింగళి సూరన కళాపూర్ణోదయం
వచన రచన: రెంటాల గోపాలకృష్ణ
ఒక అద్భుత కల్పిత కథాకావ్యం కళాపూర్ణోదయం. దీనిని రచించినవాడు పింగళి సూరనామాత్యుడు. భావబంధురమైన కవితారచనలో నేమి, అపూర్వకల్పనా సామర్థ్యంలో నేమి, తిక్కన వంటి వారిని మినహాయిస్తే, సూరనార్యుడికి సాటివచ్చేవాడు ఆంధ్ర కవులలో మరొకడు లేడు. ఇతను సంస్కృతాంధ్రము లందు అసమాన పండితుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి.
కళాపూర్ణోదయం ఎనిమిది ఆశ్వాసాల అద్భుత కావ్యం. మాములుగా తక్కిన ప్రబంధ కథల వలె ఇందలి కథ పురాణ ప్రసిద్ధం కాదు. ఈ కథకు మూలం అంటూ లేదు.
కార్యాలు ముందు చూపి, కారణాలు తరువాత చూపుతూ, తృటికాలంలో పాత్రలు సంభాషణలు మారుస్తూ ఒక ఇంద్రజాలం చేశాడు పింగళి సూరన. ఆది నుంచి అంత్యం వరకఊ కనపడీ కనపడకుండా ప్రధాన కథ మహావేగంగా పరిగెత్తేడట్లు కావ్యం రచించాడు.
'నభూతో నభవిష్యతి' అన్నట్లు సూరనార్యుడు రచించిన కళాపూర్ణోదయం తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టస్థానం అలంకరించి ఉండగలదు.
- ప్రచురణకర్తలు
