-
-
పిల్లల అలవాట్లు
Pillala Alavatlu
Author: Dr. Subhash C. Arya
Pages: 104Language: Telugu
ఈ పుస్తకం గర్భధారణ మొదలుకుని పిల్లల బాల్యదశ దాటేవరకు, వారిని పెంచడంలో తల్లితండ్రులకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం, ఆటపాటలకు సంబంధించిన అన్ని విషయాలలో అనేక సలహాలనిస్తుంది. అందరూ తప్పక దగ్గర వుంచుకోవాల్సినంత అవసరమైన మార్గదర్శి. అందుకే అందరూ దగ్గరుంచుకోవాలి.
- ది టైమ్స్ ఆఫ్ ఇండియా
డా. ఆర్యకు శిశువైద్యంలో అపారమైన అనుభవం వుండడమేగాక, ఎంత క్లిష్టమైన సమస్య గురించైనా సాధారణమైన మాటలతో వివరించగలిగిన నేర్పు వుంది. తమ పిల్లల శారీరక, మానసిక, ఉద్వేగాలకు సంబంధించిన అనేక సమస్యలను అవగాహన చేసుకుని, పరిష్కరించుకునే అవకాశం అనేక మంది తల్లితండ్రులకు సహకరించగలుగుతుంది ఆయన రాసిన ఈ పుస్తకం. రచయిత ఆచరణాత్మకంగా, వృత్తిపరంగా తనకుగల అపార అనుభవాన్ని గ్రంథ రూపంలో మలచడం ద్వారా తల్లులకు తమ పెంపకంపై విశ్వాసాన్ని నేర్పరితనాన్ని కలిగించడం ద్వారా ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన బాల్యానికి బాటలు వేశారు. ఆకట్టుకునే చిత్రాలు ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణగా నిలుస్తాయి.
- ఫెమినా
