• Pichchi Pullaiah Kathalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పిచ్చి పుల్లయ్య కథలు

    Pichchi Pullaiah Kathalu

    Author:

    Pages: 60
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పళ్ళురాని పాపాయి నుండి పళ్ళురాలిన తాతదాకా కథలంటే చెవులు కోసుకోనిదెవరు చెప్పండి. కథలంటే అందరికీ ఇష్టమే. కానీ, కథెప్పుడు పుట్టింది, ఎలాపుట్టింది చెప్పడం కష్టం. కారణం కథకి మనిషికున్నంత చరిత్రవుంది. కథకి కొలతలు, కొలనూనాల్లేవు ఎవరి పద్ధతిలో వారు రాస్తారు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ఆకట్టుకుంటారు. కొందరి రైటర్స్‌ ప్రతిపాదించే విషయం, పట్టుకున్న సిద్ధాంతం మనకు నచ్చకున్నా, వారి శైలి, కథాకధనం మనల్ని ఆకట్టుకుటుంది. కథలు వ్రాయడం చాలా సులభం అంటారు కొందరు. మూడు పూటల్లో మూడు కథలు వ్రాసి పారేసే మహానుభావులూ వున్నారు. కానీ, కథని మనమెంత తేలిగ్గా వ్రాస్తే అంత తేలిగ్గా వుంటుంది. కారణం కథలు వ్రాయడం సులభమైనా మంచి కథలు వ్రాయడం కష్టం. అదో తపస్సు. దానికై నిరంతర పరిశీలన, లేఖనం అవసరం. కథని పంచేంద్రియాలతో చెప్పాలి. రంగులు, రుచులు, ధ్వనులు, వాసనలు, స్వర్శ చెప్పాలి. రచయిత కథలోలేనమై రాసినప్పుడు ఇవన్నీ చాలా సహజంగా, ఎంతో స్పష్టంగా సమకూరుతాయి. కథల్లో శుధ్ధ కల్పన, శుద్ధ వాస్తవం పనికిరావు. రెండూ కలగలుపుగా వుండాలి. రైటర్‌లో బాహ్యదృష్టి అంతర్‌ దృష్టి రెండూ వుండలి. కథల్ని ఏవిధంగా మల్చుకోవాలన్నా మల్చుకోవచ్చు. అందులోనుండి కన్నీటిని దించవచ్చు. లేక మంటలు రేపవచ్చు. పాఠకుల్నికితకితలు పెట్టవచ్చు. ఎవరెన్ని చెప్పినా కథా రచనలోని మంత్ర రహస్యాన్ని ఏ గురువు బోధించినా, కథారచన కౌశీల్యం అబ్బే విద్యకాదు. ఎక్కాలొస్తే లెక్కలొస్తాయనుకోవడం ఎంత భ్రమో ఇదే అంతే! దానికై అంతర్మథనం కావాలి. ఆహోరాత్రులు తపించాలి. ఆ తపస్సులో అంతరంతాల్లోంచి పుట్టి, సృష్టించి పరిమళించే ప్రసూనమే కథ. సున్నిత హాస్యంతో నేను వ్రాసిన ఈ ''పుచ్చి పుల్లయ్య'' కథల్లో ఏ ఒక్కటైనా పాఠకుడ్ని ఆకట్టుకోగలిగితే మనస్సుకు హత్తుకోగలిగితే నా రచనకి సార్థకత లభించినట్లు భావిస్తాను.

- శైలి

Preview download free pdf of this Telugu book is available at Pichchi Pullaiah Kathalu