-
-
పిచ్చి పుల్లయ్య
Pichchi Pullaiah
Author: Leo Tolstoy
Publisher: Manchi Pustakam
Pages: 53Language: Telugu
లియో టాల్స్టాయ్ (1828-1910) నవలాకారుడు, చిన్న కథల రచయిత, తత్త్వవేత్త. యుద్ధమూ-శాంతి, అన్నా కెరనినా అన్న రెండు నవలలకు అతడు ప్రఖ్యాతి గాంచాడు. సంపన్న కుటుంబంలో పుట్టిన టాల్స్టాయ్ చాలా సాదా జీవితం గడిపేవాడు. అతడు క్రీస్తు నైతిక బోధనలను బలంగా నమ్మాడు. ఎటువంటి అధికారాన్ని సమ్మతించని అనార్కిస్టు అతడు. యుద్ధాలను వ్యతిరేకించిన టాల్స్టాయ్ పిల్లల కోసం ఎన్నో కథలు రాశాడు. ఈసాపు కథలను రష్యన్లోకి అనువదించడానికి అతడు ప్రత్యేకంగా గ్రీకు భాష నేర్చుకున్నాడు. అయితే ఈసాపు కథలలో చివర ఉండే నీతి వాక్యాన్ని టాల్స్టాయ్ తీసేసాడు. ఈ కథల నుంచి ఏమి తెలుసుకోవాలన్నది పిల్లలకే వదిలెయ్యాలన్నది అతని అభిప్రాయం.
టాల్స్టాయ్ రాసిన చిన్నకథలలో 'ఐవాన్ ద ఫూల్' ఒకటి. దీనిని అతడు 1886లో రాశాడు. ఈ కథకి తెలుగు అనువాదమే 'పిచ్చి పుల్లయ్య'. పుల్లయ్య రైతు కాగా, అతడి అన్నలలో ఒకరు సైనికుదు, మరొకరు వ్యాపారి. వాళ్ళ పనులు వాళ్ళని ఎక్కడెక్కడికి తీసుకెళ్ళాయి, వాళ్ళ మధ్య తగవులు పెట్టాలన్న ఉద్దేశంతో పిల్ల పిశాచాలు, దెయ్యం చేసిన ప్రయత్నాలు ఏమయ్యాయి? ఇది చదివి మీరే తెలుసుకోండి.
