• Personal Development
  • Ebook Hide Help
    ₹ 140.4
    156
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పర్సనల్ డెవలప్‍మెంట్

    Personal Development

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 113
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'పర్సనల్‌ డెవలప్‌మెంట్‌' అంటే వ్యక్తిగత అభివృద్ధి. వ్యక్తిగతంగా అభివృద్ధి చెందకుండా ఎవరూ ఏమీ సాధించలేరు. అంటే ప్రతి వ్యక్తికి కొన్ని విలువలు వుండాలి. ఆ విలువలతోనే ఎదగాలి. ఎన్ని డిగ్రీలు చదివినా ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా, ఎంత సంపాదిస్తున్నా కొన్ని నిర్దేశిత విషయాలపై సమగ్రమైన అవగాహన, వివేకం, నైపుణ్యం, వైఖరి వుండాలి. వ్యక్తిగత అభివృద్ధి అనేది ముఖ్యంగా స్కిల్‌, నాలెడ్జి, యాటిట్యూడ్‌ వంటి విషయాలపై ఆధారపడి వుంది. ఈ కంప్యూటర్‌ సమాజంలో ప్రతి వ్యక్తికి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ వుండాలి. చాకచక్యంగా మాట్లాడటం, ప్రశాంతంగా వినటం, సరైన నిర్ణయం తీసుకోవటం వంటివన్ని స్కిల్స్‌ పరిధిలోనే వస్తాయి.

ఇక నాలెడ్జి గురించి చెప్పాలంటే - డిగ్రీల ద్వారా వచ్చిన తెలివి తేటలు కాకుండా ప్రపంచం నలుమూలలా జరుగుతున్న విషయాలను, విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూండాలి. అదే విధంగా మనం సమాజంలో బ్రతుకుతున్నాం కనుక మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకొని ఆ ప్రకారం నడచుకోవాలి. దానినే సామాజిక స్పృహ అంటారు. సమాజం కాలానుగుణంగా మార్పు చెందుతూ వుంటుంది. పది సంవత్సరాల క్రితం సమాజ పరిస్థితులకి ప్రసుతత సామాజిక పరిస్థితులకి చాలా వ్యత్యాసం వుంది. అంటే మనం కూడ ఆ మార్పులను గమనించి అందుకనుగుణంగా మనమూ మారాలి. ఇది కూడ ఒక రకమైన తెలివి అన్నమాట. అలాగే వైఖరి విషయానికి వస్తే - అహంకారం లేకుండా, ఆత్మగౌరవంతో, ఆత్మ స్థైర్యంతో, సచ్చీలతతో, అందరితో కలివిడిగా వుంటూ, అందరికీ అభిమానమైన వ్యక్తిగా - మీ వ్యక్తిగత లక్షణాలను పెంపొందించుకోవాలి. ఈ లక్షణాలతో మీకో ప్రత్యేకత వుండాలి. అప్పుడే మీకో గౌరవం, ప్రతిష్ట ఏర్పడతాయి. వ్యక్తి యొక్క వ్యక్తిగత లక్షణాల వల్లనే ఆ వ్యక్తికి హుందాతనం ఏర్పడుతుంది అంతేకాదు ఎప్పటికప్పుడు వ్యక్తి తన వ్యక్తిగత విలువలను పరిరక్షించుకోవాలి. ప్రతి సందర్భంలోను మంచి - చెడు విశ్లేషణ వుండాలి.

మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడనికి, మీ వ్యక్తిగత లక్షణాలను మరింతగా అభివృద్ధి పరచుకోవడనికి దోహదపడే ఇలాంటి విషయాలమీద అంటే స్కిల్‌, నాలెడ్జి, యాటిట్యూడ్‌ల గురించి సదవగాహన కల్గించేందుకు వీలుగా 'పర్సనల్‌ డెవలప్‌మెంట్‌' అనే ఈ పుస్తకంలో పర్సనల్‌ డెవలప్‌మెంట్‌కు ప్రయోజనం కలిగిస్తుందని ఆశిస్తున్నాను.

- డా. టి.ఎస్.రావు

Preview download free pdf of this Telugu book is available at Personal Development