• Pelliki Velaye
 • Ebook Hide Help
  ₹ 30 for 30 days
  ₹ 72
  80
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • పెళ్ళికి వేళాయే...

  Pelliki Velaye

  Author:

  Pages: 100
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

రాత్రి రెండవుతోంది. ఆరుబయటే మంచం మీద ముడుచుకు కూర్చున్నాడు ఉదయ్‌చంద్ర. దోమల సంగీతం చెవుల్లో గీపెడుతోంది. ఉన్న చికాకులతోటి ఇదో చికాకు. అతడికి ఏం చేయాలో తెలియటం లేదు. చేసిన చిన్న తప్పుకు పెద్ద శిక్షే అనుభవిస్తున్నాడు. కిరణ్ వద్దన్నా వినకుండా పార్టీ అంటూ స్నేహితుల్ని తీసుకుని బార్‌కు వెళ్ళి ఈ ఉచ్చులో ఇరుక్కుపోయాడు...

ఆ ఆటో డ్రైవరు చెప్పినట్లు ఆ పోలీసోడికి పది రూపాయలిచ్చి వెళ్ళిపోయినా బాగుండేది. తాగిన మత్తులో అహం ఆ పని చేయనీయలేదు. ఇంట్లో ఎంత గందరగోళం పడుతున్నారో. “పడుకుంటా... తెల్లవారుతూనే లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతాను... ఎవడడ్డమొస్తాడో చూస్తాను.” అన్నాడు రోషంగా.

మంచానికి పక్కనే గ్రెనైట్ రాయి వేసుకుని మాణిక్యం అతడికి కాపలా అన్నట్లుగా కూర్చున్నది. కాస్త దూరంలో చిటికలపాండు ముఠా అంతా చెట్టుక్రింద జేరి సిగరెట్లు త్రాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. మందు కూడా కొడుతున్నారేమో అనిపించినా ఆ చీకట్లో కనబడటం లేదు. రాక్షసుల్లా వున్నారు అందరూ ఒళ్ళు బలిసి.

"అమ్మమ్మా! ఆ పనిమాత్రం చేయబోకండి... అలా చేశారో నాలుగు రోజుల దాకా ఇంటికి వెళ్ళలేరు!" అన్నది నోటిమీద టపటపా కొట్టుకుంటూ మాణిక్యం.

"ఆ మాత్రం నడవలేనా ఏమిటి?” బింకంగా అన్నాడు.

“నడవటం కాదు బాబూ... పడుకోవటం... ఇక్కడ ఎవరూ రాత్రిళ్ళు నిద్రపోరు... మెళుకువలో కూర్చోవాల్సిందే.. పగలే నిద్రలు... నేను ఇంకో గంటలో వంట మొదలుపెడితే అది అయ్యేటప్పటికి తూర్పున సూర్యుడు వచ్చేస్తాడు... ఆయన్ను చూస్తూనే ఓ దణ్ణంపెట్టేసి పదుకొని నిద్రపోతాను."

"అదేం?" అన్నాడు వింతగా ఆమెనే చూస్తూ.

“యాభై ఏళ్ళ క్రితం మా నాయన ఈ స్మశానానికి కాపరి... అప్పుడు ఐదెకరాల స్థలం... చిన్నగా మూడెకరాలు కబ్జాచేసి, రెండొందల గజాల చొప్పున ప్లాట్లువేసి కూతుళ్ళకీ, కొడుకులకీ, బంధువులకూ ఉచితంగా ఇచ్చారు... ఎవరూ అమ్మటానికి వీల్లేదని కండిషన్ కూడా పెట్టాడు... అప్పుడు ఆయన ఉండేందుకు కట్టుకున్న ఈ ఇంటిని చిన్న కూతురునయిన నాకు ముద్దుగా ఇచ్చాడు... దాన్నే మేం గెస్ట్‌హౌస్ క్రింద వాడుకుంటున్నాం... ఇది స్మశాన భూమి అని చెప్పానుగా... రాత్రిళ్ళు మనం పడుకున్నామో నిద్రపట్టటం ఆలస్యం దయ్యాలు వచ్చి పక్కలో తొంగుంటయి... చూడు అటు పక్కనుంచి శవం కాలుతున్న వాసన ఇంకా వస్తున్నదా లేదా!" అన్నది కళ్ళు తిప్పుతూ మాణిక్యం.

ఆమె మాటలకు బిగుసుకుపోయాడు ఉదయ్‌చంద్ర.

మాణిక్యమే మళ్ళా ముందుకు వంగి, గొంతు తగ్గించి, "నేను చెబుతున్నాను వినుకో.... వీళ్ళు రాక్షసులు... వాళ్ళడిగిన డబ్బు ఇచ్చేసి హాయిగా ఇంటికి పో... వెధవ డబ్బుకోసం బ్రతుకు పాడు చేసుకోబోకు!" అన్నది అనునయంగా, “అసలే రాత్రి నుంచి మంచి నీళ్ళుకూడా తాగకుండా బిగుసుకు కూర్చున్నావ్... వాళ్ళ దెబ్బలకు తట్టుకోలేవు!"

ఆమె మాటలు విన్నప్పటినుంచి ఉదయ్‌చంద్ర ఆ మంచం మీదే బొమ్మలా తూర్పువయిపుకు కళ్ళార్పకుండా వెలుగు ఎప్పుడు వస్తుందా అన్నట్లుగా చూస్తూ కూర్చున్నాడు.

Preview download free pdf of this Telugu book is available at Pelliki Velaye